బాలకృష్ణ ది చిన్నపిల్లల మనస్తత్వం.. అని ఆయన్ని దగ్గరనుండి చూసిన ప్రతి వ్యక్తి చెబుతారు. సినిమా సెట్స్ లో అందరితో చిన్నపిల్లాడిలా మారిపోయి ఎంతో ఫన్ చేస్తుంటారు. ఆయనకి ఆనందం ఎక్కువే, కోపమూ ఎక్కువే. ప్రస్తుతం బాలయ్య బాబు NBK107 షూటింగ్ తో బిజీగా వున్నారు. టర్కీలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. NBK107 సెట్స్ లోనే కొడుకు మోక్షజ్ఞ బర్త్ డే ని బాలయ్య సెలెబ్రేట్ చేసారు. ఈ సినిమాలో శృతి హాడిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సప్తగిరి లాంటి వాళ్ళు కమెడియన్స్ గా కనిపిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ-సప్తగిరిల ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియో లో సప్తగిరి బాలయ్య కలిసి భారీ డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ బాలకృష్ణ మధ్యలోనే ఆపడం, దాన్ని సప్తగిరి కంటిన్యూ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. సప్తగిరి చెప్పిన భారీ డైలాగ్ కి బాలయ్య బాబు బాగా ఇంప్రెస్స్ అయ్యారు. వెంటనే బాలయ్య ఫన్నీగా సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించారు. సప్తగిరి నవ్వుకుంటూ బాలయ్య కాళ్ల మీద పడ్డాడు. ఓసారి.. నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా.. అంటూ బాలకృష్ణ సప్తగిరితో చెప్పినాన్ ఈ ఫన్నీ డైలాగ్ వీడియో లో వైరల్ అయ్యింది.