Advertisement
TDP Ads

అది వదలి నెటిజెన్స్ ఇది ఎత్తుకున్నారు

Sat 10th Sep 2022 10:04 AM
bollywood,boy cott,brahmastra  అది వదలి నెటిజెన్స్ ఇది ఎత్తుకున్నారు
Disaster hashtag trends on Twitter అది వదలి నెటిజెన్స్ ఇది ఎత్తుకున్నారు
Advertisement

నిన్నటివరకు సోషల్ మీడియాలో బాలీవుడ్ పై, బ్రహ్మాస్త్ర పై తెగ నెగెటివిటి చూపించారు నెటిజెన్స్. #BoyCottBollywood, #BoyCottBrahmastra హాష్ టాగ్స్ తో బ్రహ్మాస్త్ర ని బాన్ చెయ్యాలని, బాయ్ కాట్ చెయ్యాలని తమ ఆగ్రహాన్ని చూపించారు. ఈ బాయ్ కాట్ హాష్ టాగ్స్ ని దాటి నిన్న శుక్రవారం విడుదలైన బ్రహ్మాస్త్ర కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. బాయ్ కాట్ హాష్ టాగ్స్ ని వదిలిన నెటిజెన్స్ #Disaster హాష్ టాగ్ ఎత్తుకున్నారు. నిన్న ఉదయం బ్రహ్మాస్త్ర థియేటర్స్ లోకి వచ్చిన కొద్ది సేపటికే #Disaster హాష్ టాగ్ ని ట్రెండింగ్ లోకి తెచ్చారు.

ఉదయం నుండే బ్రహ్మాస్త్ర పై తమ ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టారు. స్టిల్ ఈ రోజు వరకు ఈ #Disaster హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమా హిట్ అయినట్లయితే నెటిజెన్స్ ఏం చేసేవారో కానీ.. ఇప్పుడు సినిమా ప్లాప్ అవడంతో నెటిజెన్స్ మరింతగా రెచ్చిపోతున్నారు. స్టార్ కిడ్స్ అలియా భట్, రణబీర్ సినిమా చూడొద్దు అని నెటిజెన్స్ బలంగా కోరుకున్నట్టుగానే బ్రహ్మాస్త్రకి నెగెటివ్ టాక్ పడిపోయింది. బ్రహ్మాస్త్ర కథ బాలేదు అని, గ్రాఫిక్స్ వర్క్ బావున్నా.. క్లైమాక్స్ బాలేదు అని, నాగార్జున కేరెక్టర్ నిడివి పెంచి ఉంటే బావుంటుంది అని బ్రహ్మాస్త్ర సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నమాట.  

Disaster hashtag trends on Twitter:

 BoycottBrahmastra Is Trending

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement