Advertisementt

కార్తికేయ2 ఓటిటి ఆగమనం అప్పుడే

Fri 09th Sep 2022 07:27 PM
karthikeya 2,nikhil,karthikeya 2 ott release  కార్తికేయ2 ఓటిటి ఆగమనం అప్పుడే
Karthikeya 2 OTT has just arrived కార్తికేయ2 ఓటిటి ఆగమనం అప్పుడే
Advertisement
Ads by CJ

నిఖిల్ కార్తికేయ 2 విడుదలకు అంచనాలు ఎలా ఉన్నా.. విడుదలయ్యాక వచ్చిన టాక్ తో పాన్ ఇండియా లోని అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. హిట్ మాత్రమే కాదు నార్త్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దుమ్మురేపింది. కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది అని నిరూపించింది. పేలవంగా ఉన్న ప్రేక్షకులని థియేటర్స్ కి వచ్చేలా చేసింది. నిఖిల్ ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్బులో చేరి వేడుకలు జరిపేసుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వం, కార్తికేయ 2 కథ నార్త్ ప్రేక్షకులకి నచ్చేలా ఉండడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

అయితే కార్తికేయ 2 ఓటిటిలోకి ఎప్పుడు అడుగుపెడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ కార్తికేయ ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న నిర్ణయం ప్రకారం సినిమా రిలీజ్ అయ్యాక 8 వారాలకే సినిమా ఓటిటి లోకి రావాలి. ఇక అదెలా ఉన్నా.. ప్రస్తుతం కార్తికేయ2 కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. కార్తికేయ డిజిటల్ హక్కుల కోసం Zee5తో పాటు అమెజాన్ ప్రైమ్ కూడా బాగానే ప్రయత్నాలు చెయ్యడం.. ఫైనల్ గా Zee5 ఈ సినిమా డిజిటల్ హక్కులతో పాటుగా కార్తికేయ 2 శాటిలైట్ హక్కులని కూడా సొంతం చేసుకుంది. ఇంకా డేట్ అధికారికంగా ఫిక్స్ అవ్వకపోయినా.. ఇక సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కార్తికేయ 2 ఓటీటీలో సందడి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

Karthikeya 2 OTT has just arrived:

Karthikeya 2 OTT Release date confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ