Advertisementt

బిగ్ బాస్ 6 : కెప్టెన్సీ టాస్క్ రచ్చ రచ్చే

Fri 09th Sep 2022 05:30 PM
bigg boss 6,fima,bigg boss telugu  బిగ్ బాస్ 6 : కెప్టెన్సీ టాస్క్ రచ్చ రచ్చే
Bigg Boss 6: Today Promo Highlights బిగ్ బాస్ 6 : కెప్టెన్సీ టాస్క్ రచ్చ రచ్చే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ అవ్వడానికి హౌస్ మేట్స్ మధ్యన రచ్చ స్టార్ట్ అయ్యింది. ఆది రెడ్డి, గీతు, నేహా చౌదరిలు క్లాస్ నుండి డైరెక్ట్ గా కెప్టెన్సీ టాస్క్ లోకి రాగా.. బాలాదిత్య, సూర్య, మెరీనా-రోహిత్ జంటని హౌస్ మేట్స్ ఎన్నుకున్నారు. ఇక కెప్టెన్సీ బండి టాస్క్ లో భాగంగా ఫైమా సంచాలక్ గా వ్యవహరించింది. అందులో ఫైమా రేవంత్ ని తప్పుబడుతూ అతన్ని తప్పించింది. అన్నా అన్నా రేవంత్ అన్నా మీరు చేతులు పెట్టారంటూ గట్టిగా అరిచింది. తర్వాత నేహా చౌదరి కూడా ఫైమా తో గొడవ పడినట్లుగా చూపించారు. మెరీనా కూడా గీతు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు అవుట్ అంటూ గొడవ పడుతుంది. 

ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు కెప్టెన్ అవుతారో తెలియదు కానీ.. టాస్క్ లో పోటీ దారుల మధ్యన జరిగిన గేమ్ కన్నా.. సంచాలక్ ఫైమా తో జరిగిన గొడవే హైలెట్ అయ్యింది. ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు ఈ సీజన్ 6 హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ అవుతారో అనే ఆత్రుత బిగ్ బాస్ ప్రేక్షకుల్లో మొదలయ్యింది. మరి టాస్క్ లో పోటీ దారులు రెచ్చిపోయి మరీ కొట్టేసుకుంటూ గేమ్ ఆడేసే ఎపిసోడ్ ఈ రోజు రాత్రికి ప్రసారం అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమోతోనే సరిపెట్టుకోండి.

Bigg Boss 6: Today Promo Highlights:

Bigg Boss 6: Captaincy Task Promo Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ