Advertisementt

సూర్య వస్తుంటే చరణ్ ఎక్కడికెళ్లినట్టు

Fri 09th Sep 2022 12:09 PM
ram charan,sj surya,rac 15  సూర్య వస్తుంటే చరణ్ ఎక్కడికెళ్లినట్టు
SJ Surya enters RC15 సూర్య వస్తుంటే చరణ్ ఎక్కడికెళ్లినట్టు
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ నిన్నటివరకు RC15 షూటింగ్ లో బిజీగా వున్నాడు. టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న RC15 షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. శంకర్ అయితే భారతీయుడు 2 - RC15  షూటింగ్స్ ని ఏక కాలంలో కానిచ్చేస్తున్నారు. అయితే RC15 లో తమిళ నటుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో అది కూడా స్టైలిష్ విలన్ కేరెక్టర్ లో కనిపించబోతున్నారనే ప్రచారం ఉండగా.. మధ్యలో దిల్ రాజు వాళ్ళు మేము చెప్పేవరకు ఎవరిని మీరు కన్ ఫర్మ్ చెయ్యొద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎస్ జె సూర్య RC15 లో భాగం కాబోతున్నట్టుగా ఆయన చేతికి కూడా ఓ ఫైల్ ఇచ్చి మరీ పోస్టర్ వేసి ఆహ్వానం పలికారు.

మరి RC15 లోకి  SJ సూర్య ఎంటర్ అయిన రోజే చరణ్ చెల్లెళ్ళు, ఫ్రెండ్స్ తో కలిసి వీకెండ్ ట్రిప్ కి వెళ్ళాడు. చరణ్ తన చెల్లెలు సుప్రియ, శ్రీజ, ఇంకా మేనకోడళ్ళు, ఫ్రెండ్స్ మాత్రమే కాదు తన ముద్దుల కుక్కపిల్ల రైమా తో కలిసి వీకెండ్ ట్రిప్ కి వెళుతున్న స్పెషల్ ఫ్లైట్ లో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి.. అదేమిటి సూర్య RC15 లోకి వస్తుంటే మీరిక్కడికి వెళుతున్నారు చరణ్ అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రిప్ లో కేవలం చరణ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, మేనకోడళ్ళు మాత్రమే ఉన్నారు. ఆయన వైఫ్ ఉపాసన మిస్ అయ్యింది. మరి ఈ వీకెండ్ లో ఛిల్ అవ్వడానికి రామ్ చరణ్ ఫ్లైట్ లో వెళుతున్నదంటే పెద్ద ప్లానే అయ్యుంటుంది అంటున్నారు మెగా ఫాన్స్. ఈ ట్రిప్ అవ్వగానే చరణ్ RC15 షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

SJ Surya enters RC15:

Ram Charan along with Family and Friends went out for the Weekend Chill

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ