Advertisementt

నన్ను ఎలిమినేట్ చేసెయ్యండి బిగ్ బాస్

Fri 09th Sep 2022 10:58 AM
bigg boss 6,singer revanth,arohi  నన్ను ఎలిమినేట్ చేసెయ్యండి బిగ్ బాస్
Eliminate in Bigg Boss Says Revanth నన్ను ఎలిమినేట్ చేసెయ్యండి బిగ్ బాస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలై వారం కూడా కాలేదు. కానీ హౌస్ లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి. నామినేషన్స్ లోకి వెళ్లిన వాళ్ళ ఫ్రస్టేషన్ తో హౌస్ మొత్తం హీటెక్కింది. ముఖ్యంగా నామినేషన్స్ ఫ్రస్టేషన్ ఎక్కువగా సింగర్ రేవంత్ లోనే కనబడుతుంది. ఎందుకంటే హౌసులో సగం మంది రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ కోసం బాలాదిత్య, మెరీనా-రోహిత్, సూర్య లను హౌస్ లోని వారు ఎన్నుకోగా.. క్లాస్ లో ఉన్న గీతూ, నేహా, అది రెడ్డి లు డైరెక్ట్ గా పోటీ పడుతున్నారు. తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు పెట్టిన పోటీలో.. శ్రీ సత్య-ఆరోహి లు తమ గ్రూప్ ల తరపున పోటీ పడగా అందులో శ్రీ సత్య తన గ్రూప్ ని గెలిపించింది. 

దానితో సింగర్ రేవంత్, ఆరోహి మధ్యన గొడవ మొదలయ్యింది. ఆ గొడవలో ఆరోహి రేవంత్ కి వేలు చూపించి మాట్లాడంతో రేవంత్ దానిని తీసుకోలేకపోయాడు. అప్పటినుండి రేవంత్ నన్ను ఎలిమినేట్ చేసెయ్యండి బిగ్ బాస్ వెళ్ళిపోతాను అంటూ గోల గోల చేస్తున్నాడు. ఎంతమంది నచ్చ చెప్పినా ఆరోహి తో గొడవని మర్చిపోలేకపోతున్నాడు. రోహిత్ మిగతా సభ్యులతో మాట్లాడుతుండగా.. ఆది రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనగానే.. నిన్ను అంటే నీకు తెలుస్తుంది.. సోషల్ మీడియా నుండి వచ్చేసి అని రేవంత్ నోరుజారగానే సోషల్ మీడియా అయితే ఏంటి.. ఇక్కడ హౌస్ లో అందరూ సమానమే అంటూ ఆదిరెడ్డి గొడవేసుకున్నాడు. తర్వాత గీతూ దగ్గర కూడా ఆదిరెడ్డి ఇక్కడ నెంబర్ వన్ పొజిషన్ నుండి హౌస్ లోకి వచ్చినా అందరూ సమానమే ఎవరూ తోపులు కాదు అంటూ మాట్లాడాడు. కానీ రేవంత్ అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను పంపించెయ్యండి, నన్ను ఎలిమినేట్ చెయ్యండి అంటూ ఓవర్ చేసాడు.

Eliminate in Bigg Boss Says Revanth:

Bigg Boss 6: Yesterday episode highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ