రణబీర్ కపూర్-అలియా భట్ కలయికలో నాగార్జున, అమితాబచ్చన్, మౌని రాయ్ లు నటించిన బ్రహ్మాస్త్ర నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో తీవ్రమైన నెగెటివిటీని తట్టుకుని, బాయ్ కాట్ హాష్ టాగ్స్ ని దాటుకుని ఆయన ముఖర్జీ దర్శకత్వంలో రాజమౌళి సమర్పణలో ఆసక్తికరమైన స్టోరీ లైన్ తో సూపర్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చూసిన ఆడియన్స్, అలియా భట్, రణబీర్ ఫాన్స్ థియేటర్స్ దగ్గర సందడి చెయ్యడమే కాదు తమ అభిప్రాయాలని ట్విట్టర్ లో ఉంచుతున్నారు. అయాన్ ముఖర్జీ కథ చెప్పిన విధానం చాలా బాగుందని.. ఆలియా భట్‌తో కలిసి రణ్‌బీర్ సూపర్‌గా పెర్ఫర్మ్ చేశారని అంటున్నారు. స్టోరీ డిసెంట్‌గా ఉందని ఒకరంటే.. కొంతవరకు ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ నీరసమైన స్టోరీ లైన్ కొంత చిరాకును తెప్పించేదిలా ఉంది అని చెబుతున్నారు.
క్యారెక్టర్ ఇండక్షన్స్ సీన్స్ చాలా బాగున్నాయని.. కానీ అంచనాలకు తగ్గట్టుగా బ్రహ్మాస్త్ర లేదు, ముఖ్యంగా స్క్రీన్ ప్లే అస్సలు బాలేదని మరి కొందరు చెబుతున్నారు. అలాగే ఈ సినిమా రన్ టైం తగ్గిస్తే బెటర్ అంటున్నారు. పాత్రల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బావుండేదని, కొన్ని సన్నివేశాల్లో హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఉన్నప్పటికీ ఎమోషన్స్ మాత్రం అందుకు తగ్గట్టుగా వర్కౌట్ కాలేదని.. అని కొంతమంది చెబుతుంటే.. కొంతమంది సినిమా పర్వాలేదు.. అలియా భట్, రణబీర్ కోసం చూడొచ్చు అంటున్నారు. మరి మూవీ పూర్తయ్యాక ఫుల్ రివ్యూ ఎలా ఉండబోతుందో అనేది కాస్త వేచి చూడాల్సిందే.