బిగ్ బాస్ సీజన్ 6 ని అటు స్టార్ మా లో రాత్రి 10 గంటలకి.. ఇటు హాట్ స్టార్ లో 24 గంటలూ ప్రసారం చేస్తున్నారు. కొంతమంది హాట్ స్టార్ లోనే బిగ్ బాస్ ని వీక్షించేసి అందులో జరిగే ఘటనలపై న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకప్పుడు లీక్ లు ఇబ్బంది పెట్టేవి. నిన్నటికి నిన్న నామినేషన్స్ అనేది రాత్రి 10 గంటల వరకు బయటికి రావు కానీ ఇప్పుడు ఆ లీకుల కన్నా ముందే హాట్ స్టార్ లో వచ్చెయ్యడం, అవి న్యూస్ ల రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎవరూ ఆతృతగా స్టార్ మా లో ప్రసారం అయ్యే 10 గంటల ఎపిసోడ్ వరకు ఎదురు చూడడం లేడు.
ఇక హాట్ స్టార్ లో 24 గంటలు చూడకపోయినా పొద్దున్నే, మధ్యాన్నం, సాయంత్రం హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారో అని ఓపెన్ చేసినా చాలు.. నైట్ వెయిట్ చేసి ఆ ఎపిసోడ్ చూసే అవసరం ఉండదు. మరి హాట్ స్టార్ లో 24 అవర్స్ ప్రసారం చేసే వారు.. స్టార్ మా లో మళ్ళీ ఎపిసోడ్ వెయ్యడం ఎందుకు, అది కూడా నైట్ 10 గంటలకి.. ఏ 9.30 కో అయితే బావుండేది అంటూ బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.