ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ అందరిలో ప్రభాస్ ఓ అడుగు ముందే ఉన్నారు. బాహుబలి రెండు పార్టులతో ప్రభాస్ క్రేజ్ ఎంతగా ఎదిగిందో ఆయన పారితోషకం కూడా అంతే పెరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా పుష్ప పాన్ ఇండియా మార్కెట్ లోనే కాదు.. హిందీ మార్కెట్ లోను బాక్సాఫీసుని గజగజ వణికించేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి అల్లు అర్జున్ ని పుష్ప సినిమా తిరుగులేని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. తర్వాత ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టామినాని సంపాదించారు. అయితే ఇప్పుడు పారితోషకాల లెక్కలు చూస్తే టాప్ లో ఇంతవరకు ప్రభాస్ ఉన్నారు.
కానీ ఇప్పుడు పుష్ప పార్ట్2 కి అల్లు అర్జున్ 125 కోట్ల పారితోషకం అందుకోబోతున్నారే న్యూస్ తో పాటుగా.. అవతార్ కోసం అల్లు అర్జున్ 500 కోట్ల పారితోషకం అంటూ మెగా పీఆర్వో ఒకరు ట్వీట్ చేసారు. ప్రభాస్ ఆదిపురుష్ కోసం 150 కోట్లు అందుకుంటుంటే.. రామ్ చరణ్ RC15 కి 100 కి కోట్ల పారితోషకం, మహేష్ బాబు SSMB28 కోసం 70 కోట్లు అందుకోబోతున్నారంటూ సదరు పీఆర్వో ట్వీటాడు. అందరిలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరోగా అల్లు అర్జున్ నిలిచాడంటూ ఆ ట్వీట్ లో ఆ పీఆర్వో రాసుకొచ్చాడు.