Advertisementt

వైరల్: RC15 లీకెడ్ వీడియో

Thu 08th Sep 2022 12:21 PM
rc15,ram charan,shankar  వైరల్: RC15 లీకెడ్ వీడియో
Viral: RC 15 leaked video వైరల్: RC15 లీకెడ్ వీడియో
Advertisement
Ads by CJ

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కున్నాయి. RC15, భారతీయుడు 2 షూటింగ్స్ తో శంకర్ రికార్డ్ సృష్టిస్తున్నారు. రామ్ చరణ్ తో చెన్నై లో RC15 షూటింగ్, ఇండియన్ 2 ని కూడా చెన్నై లోనే ఓ స్టూడియో లో వేసిన సెట్ లో కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ చేస్తూ.. అక్కడొక షెడ్యూల్, ఇక్కడొక షెడ్యూల్ కంప్లీట్ చేస్తూ మజా ఇస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అండ్ టీం చెన్నై లో సందడి చేస్తుంది. అయితే RC15 షూటింగ్ స్పాట్ నుండి ఎప్పుడు ఏదో ఒక పిక్ కానివ్వండి, ఏదో ఓక్ వీడియో కానివ్వండి లీకై మెగా ఫాన్స్ కి ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రామ్ చరణ్ గెటప్, అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలు లీకై ఇప్పటికే సోషల్ మీడియా ని షేక్ చేసాయి.

ఇప్పుడు రీసెంట్ గా చెన్నై నడి రోడ్డు మీద నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండ‌దు అంటూ ట్రాఫిక్ పోలీస్‌తో రామ్ చరణ్ గొడవడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. న‌డి రోడ్డుపై చరణ్ పోలీసుని ఆట ప‌ట్టించి సాంగ్ పాడుతూ డాన్సులు కూడా చేసిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. RC15 లో చరణ్ డ్యూయెల్ రోల్ చెయ్యబోతున్నారు. ఒక కేరెక్టర్ కి కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసి వచ్చే వేసవిలో రిలీజ్ చెయ్యాలని శంకర్ అండ్ టీం చూస్తుంది.

Viral: RC 15 leaked video:

Foottapping song from RC 15 leaked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ