టాలీవుడ్ హీరో శర్వానంద్ కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమయ్యాడు. ఆయన నటించిన శ్రీకారం హిట్ అన్నప్పటికీ లెక్కలు తేలలేదు. హను రాఘవపూడి తో చేసిన పడి పడి లేచే మనసు సినిమా బావుంది అన్నా బాక్సాఫీసు దగ్గర ఢీలా పడిపోయింది. మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు డిసాస్టర్ తర్వాత శర్వానంద్ నుండి వస్తున్న మూవీ ఒకే ఒక జీవితం. ఈ సినిమాపై అంచనాలు పెంచి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు శర్వానంద్ అండ్ టీం తంటాలు పడుతుంది. అమల అక్కినేని, అఖిల్ తోనూ సినిమా ప్రమోట్ చేయించడమే కాకుండా రెండు రోజుల ముందే మహేష్ AMB మాల్ లో స్పెషల్ ప్రీమియర్స్ వేయించేసాడు.
అయితే ఒకే ఒక జీవితం సినిమాకి మాటలు రాసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తో చేసిన ఫన్నీ ఇంటర్వ్యూలో శర్వానంద్ చాలా విషయాలను రివీల్ చేసాడు. రీసెంట్ గా నేను చేసిన సినిమాల్లో నాలుగైదు ఫ్లాప్ అయ్యాయి. ఆ ప్లాప్ ల లిస్ట్ లో పడి పడి లేచే మనసు ఒకటి. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో చేశాను. ఎండని వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడ్డాం. ఆ సినిమా పోయినప్పుడు నేను పూర్తిగా అప్సెట్ అయ్యాను, దాదాపు మూడు నెలలపాటు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఆ ప్లాప్ నుండి తేరుకోవడానికి చాలా టైం పట్టేసింది. ఆతర్వాత ప్లాప్ ల విషయంలో కాస్త సర్దుకున్నాను, వాటి నుండి పాఠాలు కూడా నేర్చుకున్నాను. ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చెయ్యాలనే విషయాన్ని తెలుసుకుని ముందుకు వెళుతున్నా.. అందులో భాగంగానే ఆరు నెలలపాటు అలోచించి ఈ ఒకే ఒక జీవితం చేశాను. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని నమ్ముతున్నాను అంటూ శర్వానంద్ తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.