ఇప్పుడు ఏ హీరో ఏ పార్టీ లోకి వెళతాడు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తాడు అనే విషయమై ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ మధ్యన సినిమా ప్రముఖుల రాజకీయ ఆలోచనలు, వాళ్ళు చేసే పనుల్లో అందరిలో ఆత్రుతని కలిగించేవిలా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లోని ప్రముఖులు చాలామంది జగన్ తో భేటీ అవ్వడంతో ఏపీ రాజకీయాల్లో సినీ ప్రముఖుల పాత్రపై సర్వత్రా ఆసక్తి మొదలు కాగా.. ఈమధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని బిజెపి నేత అమిత్ షా పర్సనల్ గా మీటడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఎన్టీఆర్ బిజెపి కి మద్దతు ఇవ్వడం ఖాయమంటూ మీడియాలోనూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎన్టీఆర్ - బిజెపి కలయికపై ఎలాంటి స్పష్టత లేదు కానీ.. ఈలోపే ఎన్టీఆర్ పై టాలీవుడ్ గుస్సా, ఎన్టీఆర్ - బిజెపి మైత్రి చూసి టీఆరెస్ ప్రభుత్వానికి కాలింది. అందుకే ఎన్టీఆర్ గెస్ట్ గా జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆపించేసింది.. అబ్బో ఇలా చాలానే వార్తలొచ్చేశాయి.
అదలా ఉంటే జనసేన నేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మెగా ఫ్యామిలీ ఉంది. మెగాస్టార్ చిరు తమ్ముడికి డైరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వకపోయినా.. ఆయన సపోర్ట్ జనసేనకే. ఆయన ఫ్యామిలీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే. అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు ఏం చెబుతన్నాయంటే.. జూనియర్ ఎన్టీఆర్ బిజెపి కి ప్రచారం చేస్తాడు. రామ్ చరణ్ జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తాడు.. టిడిపితో ప్రాబ్లెమ్ లేదు.. టిడిపి-బిజెపి ని కలిపేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటూ బిజెపి నేతలు మాట్లాడడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో రామ్ చరణ్-ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తారంటూ వస్తున్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.