నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ లో బాలాదిత్య, అభినయశ్రీ, ఇనయాలు డైరెక్ట్ గా ట్రాష్ నుండి నామినేషన్స్ లోకి వెళ్లారు. ట్రాష్ లో ఉండాల్సిన రేవంత్, శ్రీహన్, గలాటా గీతు లు క్లాస్ లోకి వెళ్లి మాస్ కి వచ్చారు. ఇక ఈ వారం ఆ ముగ్గురే నామినేషన్స్ లో ఉన్నారు.. ఇక నామినేషన్స్ ప్రక్రియ లేనట్టే అనుకున్నారు. కానీ గత సీజన్స్ లా కాకుండా ఈ సీజన్ లో బుధవారం నామినేషన్స్ ఉంటాయని ప్రచారం జరిగినట్టుగానే.. ఈ బుధవారం హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా మొదలయ్యింది. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటారో.. వాళ్ల పేర్లు రాసి ఆ చీటీలను టాయిలెట్ సీట్లో వేయాలి.. ఇలా ఎక్కువ ఎవరి పేర్లు టాయిలెట్ సీటులో పడతాయో వాళ్లు నామినేట్ అయినట్టు.
అందులో ఫైమా ని నామినేట్ చేసేందుకు రేవంత్ ఇతర సభ్యులు ప్రయత్నం చేసినా ఆమె డిఫెండ్ చేసుకుంది. తర్వాత సింగర్ రేవంత్.. ఆటకారి కన్నా మాటకారి అంటూ ఫైమా రేవంత్ ని నామినేట్ చేసినట్టుగా చూపించారు. ఇంకా కొంతమంది రేవంత్ ని టార్గెట్ చేసారు. ఫైనల్ గా ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారి లిస్ట్ మీ కోసం..
1. ఆరోహి
2. ఇనయ
3. అభినయ శ్రీ
4. సింగర్ రేవంత్
5. జబర్దస్త్ ఫైమా
6. శ్రీ సత్య
7. చలాకీ చంటి ఉండగా.. బాలాదిత్య లక్కీగా ఈ నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. క్లాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బాలాదిత్యని నామినేషన్స్ నుంచి సేవ్ చేసి.. ఆ ప్లేస్‌లో ఆరోహిని డైరెక్ట్‌గా నామినేట్ చెయ్యడంతో బాలాదిత్య తప్పించుకున్నాడు. ఫైనల్ గా ఈ నామినేషన్స్ హీట్ హౌస్ లో మాములుగా లేదు. వారం గడవకముందే అందరి మధ్యన విభేదాలు మొదలైపోయాయి.