హీరో నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ మూవీ ని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. బంగార్రాజు హిట్ జోష్ లో నాగర్జున ఘోస్ట్ ని దసరా స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. అది కూడా చిరు గాడ్ ఫాదర్ మీద కి వదులుతున్నారు. మరోపక్క భార్య అమల నటించిన ఒకే ఒక జీవితం ప్రిమియర్ షోకి హాజరయ్యారు. అయితే తాజాగా నాగార్జున విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. 2024 ఏపీ లో జరగబోయే ఎన్నికల సమయానికి నాగార్జున విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి వైసిపి తరపున పోటీ చేయబోతున్నారనే న్యూస్ అక్కినేని ఫాన్స్ ని షేక్ చేస్తుంది.
గత ఎన్నికల టైం లోనే వైసిపి తరపున నాగార్జునకి ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. అప్పట్లో పీవీపీ ఉన్నాడు కాబట్టి నాగ్ పాలిటిక్స్ ని, వైసిపి ఇచ్చిన ఆఫర్ లైట్ తీసుకున్నారని.. కానీ ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు పీవీపీ సుముఖంగా లేకపోవడం, అటు కేశినేని నాని పై పోటీ చేసేందుకు క్రేజ్ ఉన్న, స్టామినా ఉన్న వ్యక్తి కావాలనే ఆలోచనలతో నాగార్జున ని ఎట్లాగైనా ఈ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలనే వైసిపి ప్రభుత్వం చూస్తుందట. జగన్ పర్సనల్ గా నాగ్ తో చర్చించి ఒప్పించడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎంపీ గా పోటీ చేసే విషయమై నాగ్ ఎట్లా స్పందిస్తారో చూడాలి.