బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కావడమే బుల్లితెర ప్రేక్షకులు రసవత్తరంగా ఫీలయ్యేలా చేస్తుంది. ప్రేక్షకులకి ఎలాంటి మసాలా కావాలో అది మొదటి రోజునుండే బిగ్ బాస్ అప్లై చేస్తుంది. గొడవలు కొట్లాటలు బిగ్ బాస్ టీఆర్పీ పెరగడానికి ముఖ్యకారణం. అదే ఇప్పుడు సీజన్ 6 హౌస్ లో జరుగుతున్నది. ప్రస్తుతం ఇనాయ vs గలాటా గీతు అన్న రేంజ్ లో గొడవలు స్టార్ట్ అవ్వగా.. ఈ రోజు టాస్క్ లో సింగర్ రేవంత్ అభినయ చేతిలో ఓడిపోయాడు. తర్వాత బాగా ఎమోషనల్ అవ్వగా.. ఇప్పుడు హౌస్ లోకి జంటగా అడుగుపెట్టిన వారి మధ్యన కూడా గొడవ మొదలైంది. టాస్క్ లో ఓడిపోయిన ఇనాయ నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు అని అర్ధమైంది అంది.
దానికి సింగర్ రేవంత్ ఎవ్వడు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా పక్కోడి గేమ్ లో శబ్దం ఉంటే వాడు గెలుస్తాడు అన్నాడు. తర్వాత మెరీనా-రోహిత్ మధ్యన కూడా ఈరోజు ఎపిసోడ్ లో గొడవైనట్లుగా ప్రమో వదిలారు. మెరీనా - రోహిత్ లు వాష్ ఏరియాలో ఉండగా.. మెరీనా ఫస్ట్ డే మనం నామినేషన్స్ అనుకున్నాం కదా.. కొన్ని కొన్ని చెబుదాం అని, గీతు ఏడవాల్సి వచ్చింది అని అనగా దానికి రోహిత్ తన బాడీని మిర్రర్ లో చూసుకుంటూ ఊ ఉన్నాడు. దానికి మెరీనా కోపంగా ముందు నువ్వు బాడీ అన్న చూసుకో.. లేదా నేను చెప్పేదన్నా విను అంది. సారి చెప్పు అన్నాడు రోహిత్. కానీ మెరీనా మాత్రం అవసరం లేదు అంది. ఓవరేక్షన్ చెయ్యకు అన్నాడు రోహిత్.. ఓవరేక్షన్ కాదు అని మెరీనా కోపంగా వెళ్లిపోగా.. సింగర్ రేవంత్ ఏం పరిస్థితి తెచ్చావ్ సామి బిగ్ బాసా అంటూ చెప్పిన డైలాగ్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది.