నందమూరి బాలకృష్ణ తనయుడు, ఆయన వారసుడు మోక్షజ్ఞ చాలా రేర్ గా పబ్లిక్ కి దర్శనమిస్తుంటాడు. అందరి సెలబ్రిటీ కిడ్స్ లా కాకుండా మోక్షజ్ఞ మీడియాకి, సోషల్ మీడియాకి చాలా దూరం. అందుకే మోక్షజ్ఞ ఫోటో ఏది బయకి వచ్చినా నందమూరి ఫాన్స్ చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతూ షేర్ చేస్తుంటారు. అక్కల పెళ్లిళ్లలో కానీ, నందమూరి ఫ్యామిలీ ఈవెంట్స్ లో ఎక్కడా మోక్షజ్ఞ పబ్లిక్ కి ఫోకస్ అవ్వడు. అలాగే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై గత కొన్నేళ్లుగా సస్పెన్స్ కొనసాగుతుంది. నేడు మోక్షజ్ఞ పుట్టిన రోజు. ఈ రోజు నందమూరి కాంపౌండ్ నుండి మోక్షజ్ఞ సినిమా అప్ డేట్ ఏదైనా బయటికి వస్తుందేమో అని నందమూరి అభిమానులతో పాటు మీడియా కూడా చాలా వెయిట్ చేసింది. కానీ అలాంటిదేం జరగలేదు.
ఈ విషయంలో నందమూరి ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయినా.. సాయంత్రానికి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో మోక్షజ్ఞ కనిపించడం మరింత సంతోషాన్నిచ్చింది అభిమానులకి. అది NBK107 సెట్స్ లో బాలయ్య బాబు కొడుకు బర్త్ డే ని సెలబ్రేట్ చేసి మోక్షజ్ఞకి కేక్ తినిపిస్తున్న పిక్ చూసిన ఫాన్స్ కడుపునిండిపోయింది. మోక్షజ్ఞ ఆ పిక్ లో కాస్త బరువుగానే కనిపిస్తున్నాడు. అయినా ఆయన కొత్త లుక్ చూసిన ఫాన్స్ కేరింతలు కొడుతున్నారు. అన్నట్టు షూటింగ్ నిమిత్తం NBK107 టీం టర్కీలో ఉన్న విషయం తెలిసందే. అంటే మోక్షజ్ఞ తండ్రి దగ్గరకి వెళ్లి మరీ తన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నాడన్నమాట.