Advertisementt

సమంతపై రాస్తే కోర్టుకెళ్లాల్సిందే

Tue 06th Sep 2022 05:20 PM
samantha,yasoda,shakuntalam  సమంతపై రాస్తే కోర్టుకెళ్లాల్సిందే
Samantha Manager Gives Clarity On Her Health Issues సమంతపై రాస్తే కోర్టుకెళ్లాల్సిందే
Advertisement
Ads by CJ

గతంలో సమంత సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ తనపై వచ్చే మీమ్స్, ట్రోల్స్, న్యూస్ ల విషయంలో లైట్ తీసుకోవడం లేదు. సోషల్ మీడియాలో తనపై కామెంట్స్ చేసేవారికి మొహం పగలగొట్టెలాంటి సమాధానాలు చెప్పే సమంత ఈ మధ్యన న్యాయపరమైన యాక్షన్ తీసుకుంటుంది. గతంలో అంటే గత ఏడాది నాగ చైతన్య - సమంత ల విడాకుల తర్వాత సమంత పై వచ్చిన నెగెటివ్ న్యూస్ లు తీసుకోలేని సమంత తన లాయర్ చేత కోర్టులో కేసు కూడా వేయించిన విషయం తెలిసిందనే. ఇక రెండు రోజుల క్రితం ప్రముఖ వెబ్ సైట్ లో ఓ హీరోయిన్ కి స్కిన్ డిసీజ్ కారణంగా బయట ఎవరిని కలవడం లేదు, సినిమాల షూటింగ్స్ కి దూరంగా ఉంటుంది, ఆమెకి స్కిన్ ఎలెర్జి కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని రాసారు. 

ఆ వార్త చూసిన సమంత మేనేజర్ మాట్లాడుతూ.. సమంత కి ఎలాంటి ప్రోబ్లెంస్ లేవు. అలాగే స్కిన్ డిసీజెస్ కూడా లేవు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నెలలోనే ఆమె ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ కి హాజరవుతుంది.. అలాగని సమంత పై ఇలాంటి నెగెటివ్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ స్పందించడంతో ఇకపై సమంత పై న్యూస్ రాయాలంటే కోర్టు నోటీసు లు అందుకుని కోర్టు మెట్లెక్కినట్టే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha Manager Gives Clarity On Her Health Issues:

Samantha Personal Manager gives Clarity on her Health

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ