తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 మొదలై రెండు రోజులవుతుంది. ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. కొద్దిగా పేరున్న సెలబ్రిటీస్, సీరియల్ ఆర్టిస్ట్ లు, యూట్యూబర్స్, సామాన్యులు ఇలా హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ ని ఆదరించేవారు ఉన్నారు. బిగ్ బాస్ అంటే నచ్చని వారు చాలామందే ఉన్నారు. సీపీఎం నారాయణ లాంటి వాళ్ళు బిగ్ బాస్ కల్చర్ పై పచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా సింగర్ స్మిత కూడా బిగ్ బాస్ కల్చర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో అంటే తనకి అస్సలు నచ్చదు అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పడం, అది కూడా బిగ్ బాస్ మొదలైన కొత్తల్లో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేస్తాను, ఒప్పుకుని తప్పు చెయ్యను, ఎందుకో ఆ షో అంటే అసలు నచ్చదు. 100 రోజుల పాటు కుటుంబాన్ని వదలి వెళ్లాల్సిన అవసరం ఏముంది. నెలల పాటు ఒక ఇంట్లో లాక్ చేసి తన్నుకొండి.. దానితో మేము టీఆర్పీలు పెంచుకుంటాం అనడం ఎంతవరకు కరెక్ట్. అందుకే బిగ్ బాస్ షోని అసలు చూడను. చూసినా నాకది అర్థం కాదు. నేను మాత్రం ఆఫర్ వచ్చి పారితోషకం రెట్టింపు ఇస్తాను అన్నా ఈ షోకు చచ్చినా వెళ్లను, నేనే కాదు నా ఫ్రెండ్స్ కానీ, తెలిసినవాళ్ళు కానీ ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తాను అంటే వద్దని వారిస్తాను. ఇప్పటికే హౌస్ లోకి వెళ్లిన వారిపై కామెంట్ చెయ్యను. అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. ఈ సీజన్ లోకి నాకు తెలిసిన వాళ్ళు వెళ్లారు. సో ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడినా వారిని నేను విమర్శించినట్టే. అందుకే ఈ షో గురించి ఇంకా మాట్లాడాలనుకోవడం లేదు అంటూ స్మిత సంచలనంగా మాట్లాడింది.