Advertisementt

పాలిటిక్స్ లోకి రష్మిక మందన్న

Mon 05th Sep 2022 08:48 PM
astrologer venu swamy,politics,rashmika mandanna  పాలిటిక్స్ లోకి రష్మిక మందన్న
Astrologer reveals Rashmika Mandanna future surprises పాలిటిక్స్ లోకి రష్మిక మందన్న
Advertisement
Ads by CJ

అదేమిటి కెరీర్ లో అంత బిజీగా వున్న హీరోయిన్ రష్మిక మందన్న పాలిటిక్స్ లోకి వెళ్లడం ఏమిటి అంటూ కంగారు పడిపోకండి. కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్న హీరోయిన్స్ ఫైనల్ గా పాలిటిక్స్ లోకి దిగడం ఎప్పటినుండో చూస్తున్నాం. విజయశాంతి, రోజా, నగ్మా, ఖుష్బూ ఇలా చాలామంది సినిమాలు చేసాక.. కెరీర్ లో డౌన్ ఫాల్ మొదలయ్యాక రాజకీయాల్లోకి దిగినవారు. కానీ ఇప్పుడు రష్మిక మాత్రం ఇంత త్వరగా రాజకీయాల్లోకి దిగడానికి కారణం వేణు స్వామి. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఈ మధ్యనే సెలబ్రిటీస్ జాతకాలతో ఫెమస్ అయిన ఆయన రష్మిక మందన్న కర్ణాటక నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనుందని.. ఆమె జాతకంలో అలా రాసిపెట్టి ఉందని బల్ల గుద్ది చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాలంటూ రేజింగ్ లో రష్మిక వరసగా సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తుంది. షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా ఎక్కే ఫ్లైట్ ఎక్కడం దిగే ఫ్లైట్ దిగడం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఆమె హడావిడి. కన్నడ నుండి మెల్లగా టాలీవుడ్ లో జెండా పాతిన రష్మిక.. బాలీవుడ్ లో జెండా ఎగరెయ్యడానికి తహతహలాడుతోంది. అలాంటి రష్మిక రాజకీయాల్లోకి వెళ్లడంపై ఆమె అభిమానులు కంగారు పడినా.. వేణు స్వామి ఆమె ఇప్పుడే పాలిటిక్స్ లోకి వెళ్లకపోయినా.. ఫ్యూచర్ లో వెళ్లే ఛాన్స్ వుంది కాబట్టి అలా చెప్పి ఉంటారని సర్ది చెప్పుకుంటున్నారట.

Astrologer reveals Rashmika Mandanna future surprises:

Astrologer Venu Swamy predictions on Rashmika Mandanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ