Advertisementt

బిగ్ బాస్ 6: ఎమోషన్స్ తో బరువెక్కిన హౌస్

Mon 05th Sep 2022 07:45 PM
bigg boss 6,bigg boss telugu,singer revanth  బిగ్ బాస్ 6: ఎమోషన్స్ తో బరువెక్కిన హౌస్
Bigg Boss 6: Today episode promo బిగ్ బాస్ 6: ఎమోషన్స్ తో బరువెక్కిన హౌస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 మొదలై జస్ట్ 24 గంటలు గడిచింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు 21 మంది కంటెస్టెంట్స్ పొలోమంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఏదో స్కూల్ లో పిల్లలని చూసినట్టుగా ఉంది ఆ గుంపుని చూస్తే. ఇక హౌస్ లోకి అడుగుపెట్టారో లేదో.. ఇలా గొడవలు స్టార్ట్ అవడమే కాదు, గుండెలు బరువెక్కే ఎపిసోడ్ ని మొదటి రోజే చూపించేసింది బిగ్ బాస్ యాజమాన్యం. బిగ్ బాస్ లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ తమ లైఫ్ లో జరిగిన ఏదో ఒక బాడ్ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంటారు. అది ఏదో ఒక ఎపిసోడ్ లో జరుగుతుంది కానీ.. ఇలా మొదటి రోజే కన్నీటి కథలని బయట పెట్టించలేదు.

ఇక గలాటా గీతు సింగర్ రేవంతో ఏదో మంచోడు అనుకున్నా అంటూ బాత్ రూమ్ ఏరియా లో తనకి తానే మాట్లాడుకుంటుంది. ఇక్కడ టాస్క్ కన్నా మాటలు ఎక్కువయ్యాయి అనగానే సింగర్ రేవంత్ మాట్లాడతా... ఇంకా 104 రోజులు మట్లాడుతూనే ఉంటాను అంటూ చెప్పాడు. తర్వాత ఇనాయ సుల్తానా తన ఫాదర్ రెండేళ్ల క్రితం పోయాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆతర్వాత గీతు కూడా ఎమోషనల్ గా మాట్లాడింది. ఇలా హౌస్ మేట్స్ మాత్రమే కాదు, బుల్లితెర ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా కంటెస్టెంట్స్ కన్నీటి కథలు ఈ రోజు ఎపిసోడ్ లో రాబోతున్నాయి. 

Bigg Boss 6: Today episode promo :

Bigg Boss 6: Today episode promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ