ఈ ఏడాది వినాయకచవితి అల్లు అర్జున్ తన ఇంట్లోనే భార్య స్నేహ, పిల్లలు ఆయన్, అర్హ లతో కలిసి చేసుకున్నట్లుగా ఫొటోస్ షేర్ చేసారు. అలాగే అల్లు అరవింద్, అల్లు ఫ్యామిలీ అంతా కలిసే వినాయక చవితి పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది అల్లు అర్జున్ తన ఆఫీస్ లో వినాయకుని ప్రతిష్టించి పూజలు జరుపుతారు. గణేష్ చతుర్థి పండుగను తన సిబ్బందితో ఘనంగా జరుపుకుంటాడు. ఈ సంవత్సరం కూడా ఆ మాదిరిగానే గణేశుని ప్రతిమను ప్రతిష్టించారు.
అల్లు అర్జున్ తన బృందంతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నట్లు ఇటీవలి వీడియో వైరల్ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్, భారతీయ సంస్కృతిని మరిచిపోలేదు. నిమజ్జన వేడుకలు నిమిత్తం రోడ్డుపైకి రావడానికి వెనుకాడలేదు. తన కూతురిని పక్కన పెట్టుకుని స్వామికి వీడ్కోలు పలుకుతూ కొబ్బరికాయ పగలగొట్టాడు అల్లు అర్జున్. అలానే అర్హను ఊరేగింపులో భాగమవ్వాలని, నిమజ్జనాన్ని దగ్గరగా చూడమని మరియు పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని చెప్పడం ఆ పిక్స్ లో హైలెట్ అయ్యింది.