Advertisementt

SSMB28 : యాక్షన్ పార్ట్ మొదలెడతారట

Mon 05th Sep 2022 04:29 PM
ssmb28,mahesh babu,trivikram  SSMB28 : యాక్షన్ పార్ట్ మొదలెడతారట
SSMB28 update SSMB28 : యాక్షన్ పార్ట్ మొదలెడతారట
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మొదలు కావాల్సిన హ్యాట్రిక్ మూవీ ఈ నెల రెండో వారంలో మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆగష్టు లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్స్ బంద్ వలన వాయిదా పడింది. ఇక SSMB28 రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ తో మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నారట. మహేశ్ బాబు .. కొంతమంది ఫైటర్లు పాల్గొనగా, రన్నింగ్ బస్సులో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తారట.

మహేష్ కెరీర్ లోనే రిస్కీ సీన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని, అలాగే మొదటి షెడ్యూల్ లో చిత్రీకరించే ఫైట్ సినిమాకి హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. చాలా డిఫరెంట్ గా ఈ ఫైట్ ను కంపోజ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కో జోడిగా పూజ హెగ్డే నటిస్తుండగా.. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాని కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా మలచబోతున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 28, 2023 న SSMB28 రిలీజ్ అంటూ మేకర్స్ డేట్ కూడా ప్రకటించేసారు.

SSMB28 update :

Mahesh Babu - Trivikram SSMB28 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ