Advertisementt

పవన్-సుజీత్.. మళ్లీ అదే తప్పు చేస్తున్నారా!

Fri 09th Sep 2022 03:52 PM
pawan kalyan,sujith,remake,theri movie,power star pawan kalyan,vijay,atlee,sahoo director  పవన్-సుజీత్.. మళ్లీ అదే తప్పు చేస్తున్నారా!
Pawan Kalyan in another Remake పవన్-సుజీత్.. మళ్లీ అదే తప్పు చేస్తున్నారా!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రీమేక్‌కి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. కోలీవుడ్‌లో విజయ్-అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘థేరి’ చిత్రాన్ని పవన్ కల్యాణ్‌తో రీమేక్ చేసేందుకు ‘సాహో’ దర్శకుడు సిద్ధమైనట్లుగా సమాచారం. ఇప్పటికే స్ర్కిప్ట్ కూడా లాక్ చేశారని తెలుస్తుంది. వాస్తవానికి ఈ చిత్రం.. అదే విజయ్ నటించిన ‘థేరి’ చిత్రం.. తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో డబ్ అయింది. ఇక్కడ పెద్దగా ఆడలేదు కూడా. అయినా మళ్లీ అదే చిత్రాన్ని రీమేక్ చేయడం ఏమిటో.. వారికే తెలియాలి. ఇంతకు ముందు పవన్ చేసిన ‘కాటమరాయుడు’ చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. అజిత్ నటించిన ‘వీరం’ చిత్రాన్ని తెలుగులో ‘కాటమరాయుడు’‌గా రీమేక్ చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పనే చేస్తున్నారు. అసలు ప్రేక్షకులకు ఏం కావాలో అర్థం కాక దర్శకనిర్మాతలు తలలు బాదుకుంటుంటే.. ఆల్రెడీ వచ్చిన సినిమాలనే మళ్లీ మళ్లీ చేయాలనే ఆలోచన ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

 

మరో విషయం ఏమిటంటే.. ఇదే చిత్రాన్ని రవితేజతో రీమేక్ చేయబోతున్నట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి. హీరోయిన్‌గా కేథరీన్ ఫైనల్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఆ వార్తలకి బ్రేక్ పడింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తోనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నట్లుగా ‘థేరి’ పేరు వినబడింది. దాదాపు కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో ఆ వార్తలలో నిజం లేదని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడైతే ఏకంగా స్ర్కిప్ట్ కూడా లాకయిందని, త్వరలోనే పూజా కార్యక్రమాలు కూడా అన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. డివివి దానయ్య, త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారనేలా ఇప్పుడు టాక్ నడుస్తుంది. అయితే పవన్ కల్యాణ్ ఈ సినిమా చేసేంత ఫ్రీగా ఎక్కడున్నాడు? ఎందుకంటే, ఆయన చేస్తున్న ‘హరిహర వీరమల్లు’, చేయాల్సిన ‘భవధీయుడు భగత్‌సింగ్’, ‘వినోదయ సితం’ రీమేక్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడీ ప్రాజెక్ట్‌కి ఆయన ఎలా ఓకే చెబుతారనేలా కూడా.. మరో వైపు వార్తలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Pawan Kalyan in another Remake:

Pawan Kalyan and Sujith Combo movie on Cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ