రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు.. అనుభవమున్న చంద్రబాబు అయితే.. కాస్త రాష్ట్రం తేరుకుంటుందని.. పార్టీ పెట్టినా, పోటీ చేయకుండా పవన్ కల్యాణ్ ఆయనకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ఫలితంగా పవన్ కల్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడంటూ పేటీఎమ్ బ్యాచ్ కొందరు ఆరోపణలు చేయడమే కానీ.. ఒక్కడూ నిరూపించలేకపోయారు. పవన్ కల్యాణ్ ఇప్పుడేదైనా కాస్త.. మంచి పని చేస్తూ ఉంటే.. ‘ప్యాకేజ్ కల్యాణ్’ అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ పిచ్చి పిచ్చి ట్వీట్స్ వేస్తుంటారు. వాటికి జన సైనికులు కూడా గట్టిగానే కౌంటర్స్ వేస్తారనుకోండి. అదే వేరే విషయం. తాజాగా చంద్రబాబుకి పవన్ కల్యాణ్ అప్పట్లో సపోర్ట్ ఇవ్వడానికి.. అసలైన కారణం ఇదేనంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ వేశారు. అయితే ఆ ట్వీట్ కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ట్రూ స్టోరీ అంటూ.. సపోర్ట్ చేసినందుకు చంద్రబాబు నుంచి పవన్ ఏం ఆశించాడో.. అంటూ పేర్లు చెప్పకుండా ఇన్‌డైరెక్ట్‌గా ఓ కథని ఆమె చెప్పుకొచ్చింది.
‘‘ఒకప్పుడు ఒక నటుడు రాజకీయ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు.. రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించి.. ఒక రాజకీయ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించాడు. అందుకు ఆ పార్టీ నాయకుడు.. నీకు ఏమి కావాలి? నేను నీకు ఏం చేయాలి? అని అడుగగా.. ఆ నటుడు.. ‘మా అన్నయ్య మరియు నా కుటుంబంపై ఛానెల్స్‌తో దాడి చేయడం ఆపితే చాలు.. అంతే’ అని సమాధానమిచ్చాడు. ఇది అసలు కథ’’ అని పూనమ్ కౌర్ తన ట్వీట్‌లో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఈ ట్వీట్ ఇప్పుడెందుకు చేసి ఉంటుందని అనుకుంటున్నారా?. సెప్టెంబర్ 4న జర్నలిస్ట్ రవి ప్రకాశ్ (టీవీ9) పుట్టినరోజు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. చంద్రబాబు, లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌ని టార్గెట్ చేస్తూ.. పూనమ్ ఇలా రియాక్ట్ అయింది. ఆ తర్వాత ఆ ట్వీట్‌ని ఆమె డిలీట్ చేసింది. కానీ, ఈ లోపే ఆ ట్వీట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అయిపోయింది.