మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా బిగ్ స్క్రీన్ మీద కనిపించని మనోజ్ అటు వ్యక్తిగతంగానూ ప్రణతి తో పెళ్లి తర్వాత విభేదాలు, విడాకులు విషయంలో సఫర్ అయ్యాడు. ఈమధ్యన ఫ్యామిలీతో కూడా కాస్త డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం మనోజ్ రెండో వివాహం పై వచ్చిన వార్తలని స్వయంగా కొట్టిపారేశాడు. నిన్న మనోజ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మనోజ్ అన్న హీరో కన్నా విలన్ రోల్స్ వేస్తె సూపర్ సక్సెస్ అవుతావ్ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెట్టారు. ఈ రోజు మంచు మనోజ్ వినాయకుడిని సందర్శించడానికి వస్తున్నాడని ఆయన పిఆర్ టీం సమాచారం ఇచ్చింది.
అంతలోనే మంచు మనోజ్ రెండో వివాహం తెరపైకి వచ్చింది. అదే భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలోనే కాదు, మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. సీతాఫల్ మండి, TRT కాలనీ గణేష్ ని సందర్శించుకున్న మంచు మనోజ్ మౌనిక రెడ్డితో కనిపించడం, గణేశుడికి ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించడం, మనోజ్ గణేశునికి హారతినివ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించగా.. మనోజ్ పక్కన మౌనిక రెడ్డి స్పెషల్ గా కనిపించింది. అంతలో ఒకరు మనోజ్ ని మౌనిక రెడ్డిని మీరు రెండో వివాహం చేసుకోబోతున్నారని విన్నాం నిజమేనా అని అడగ్గా.. అది నా వ్యక్తిగత విషయం. సందర్భం వస్తే తప్పకుండా చెబుతాను అన్నాడు. అలాగే సినిమాలు, పొలిటికల్ ఎంట్రీ పై ప్రశ్నించగా.. ఇది గణేశుని పూజ.. ముందు ఆ విషయాలు చూద్దాం అంటూ మంచు మనోజ్ సమాధానాన్ని దాటవేశారు.
భూమా నాగి రెడ్డి రెండో కూతురు మౌనికని మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని అందుకే కలిసి తిరుగుతూన్నారని అంటున్నారు. త్వరలోనే మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.