ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 లో ఏకంగా 20 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఎవరికి వారే తమ తమ అర్హతలతో బిగ్ బాస్ స్టేజ్ పై డాన్స్ లు, సాంగ్స్ పాడుతూ, ఏవి ల రూపంలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్ లో ఎక్కువగా సీరియల్ ఆర్టిస్ట్ లే ఉన్నారు. సింగర్ రేవంత్, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, అభినయశ్రీ, ఇంకా నేహా చౌదరి, జబర్దస్త్ చంటి, జబర్దస్త్ ఫైమా, ఇనాయ సుల్తానా.. ఇలా కాస్త పేరున్న సెలబ్రిటీస్ ఓ 18 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. గ్రాండ్ గా అదిరిపోయే పెరఫార్మెన్స్ లతో హౌస్ లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ సీజన్ 6 అన్నప్పటి నుండి ఈసారి హౌస్ లోకి సామాన్యుల ఎంట్రీ అంటూ చెబుతూ వస్తున్నారు.
అన్నట్టుగానే ఇద్దరు సామాన్యుల బిగ్ బాస్ సీజన్ 6 లోకి వచ్చారు. వారే ఆది రెడ్డి, ఆరోహి. వీరు సామాన్యులెం కాదు. వారికీ కాస్త బ్యాగ్రౌండ్ అంటే.. కొద్దిగా యూట్యూబ్ తో ఫెమస్ అయినవారే కావడం గమనార్హం. ఆది రెడ్డి అన్న అతను బిగ్ బాస్ సీజన్స్ కి రివ్యూస్ ఇస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుని.. బిగ్ బాస్ ని చదివేశాడు. అతనొక బ్యాంక్ ఎంప్లొయ్. కానీ ఇప్పుడు యూట్యూబర్. ఇక ఆరోహి తల్లితండ్రి లేని అమ్మాయి. ఒంటరి పోరాటం చేస్తూ హైదరాబాద్ కి వచ్చి సినిమా రంగంలో స్థిరపడాలనుకుంటున్న యువతి. సో అలా కొద్దిగా వారు ఫెమస్ అయినవారే. మరీ ఎవరికి తెలియని సామాన్యులైతే కాదు. ఇక ఈ సీజన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా కీర్తి ఎంట్రీ ఇస్తే.. లాస్ట్ కంటెస్టెంట్ గా సింగర్ రేవంత్ హౌస్ లోపలికి వెళ్ళాడు.