బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపట్టిన ప్రభాస్.. ఆ సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తో పాటుగా ఇండియా వైడ్ గా అభిమానులని సంపాదించుకున్నారు ఆయన. బాహుబలి ప్రభాస్ అనిపించుకుంటున్నారు. తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టడమే కాదు, పుష్ప రాజ్ గా అందరి గుండెల్లో నిలిచిపోయాడు. పుష్ప సాంగ్స్ క్రికెట్ మైదానాల్లోనూ మార్మోగుతున్నాయి. ఇక రామ్ చరణ్-ఎన్టీఆర్ ఒకేసారి ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్నారు. భీమ్-రామ్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల క్రేజ్ నార్త్ లోనే కాదు హాలీవుడ్ లోను మోగిపోతుంది. ఈ నలుగురు ఫస్ట్ మూవీస్ తోనే విపరీమైన క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇప్పుడు లైగర్ తో ఫస్ట్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుందామని తహతహలాడిన విజయ్ దేవరకొండ కి ఆ సినిమా భీభత్సమైన షాక్ ఇచ్చింది. లైగర్ ప్రమోషన్స్ లో అభిమానుల హడావిడి చూస్తే లైగర్ తో విజయ్ క్రేజ్ మోగిపోవడం ఖాయం, పెరిగిపోవడం ఖాయం అంటూ అంచనా వేశారు. కానీ పాపం విజయ్ ఆశలు, ఫాన్స్ అంచనాలను లైగర్ తుడిచిపెట్టేసింది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ షాకివ్వడంతో విజయ్ దేవరకొండ కూడా డైలమాలో పడి తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జన గణ మన ని ఆపేసినట్లుగా తెలుస్తుంది.