టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. మధ్యలో నటి ఛార్మి తో ప్రేమాయణం నడిపిన దేవిశ్రీ ప్రసాద్.. ఆల్మోస్ట్ ఛార్మి ని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడనే న్యూస్ నడిచింది. తర్వాత ఛార్మి హీరోయిన్ గా ఫెడవుట్ అయ్యింది. దేవిశ్రీ తో ఫ్రెండ్ షిప్ చెడింది. ఆ తర్వాత నుండి దేవిశ్రీ ఒంటరిగానే ఉంటున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఓ రూమర్ దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ని మీడియాలో హైలెట్ చేసింది. ఊపిరి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయిన పూజిత పొన్నాడ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగేందుకు కష్టాలు పడుతుంది.
అయితే ఇప్పుడు పూజిత పొన్నాడ నటించిన ఆకాశ వీధుల్లో సినిమా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పూజిత పొన్నాడ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దేవిశ్రీ తో తాను రిలేషన్ లో ఉన్నాను అని, దేవిశ్రీ ప్రసాద్ ని వివాహం చేసుకున్నాను అంటూ వస్తున్న వార్తలపై పూజిత స్పందించింది. ఇలాంటి గాసిప్స్ ఎందుకు పుట్టిస్తారో.. దేవీశ్రీ ప్రసాద్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో గాసిప్స్ రూపంలో మా పెళ్లి చేసేసి.. ఆనందిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్.. అలా దేవిశ్రీ తో తన రహస్య పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి పూజిత చెక్ పెట్టింది.