బిగ్ బాస్ సీజన్ 6 ఈ రోజు ఆదివారం సెప్టెంబర్ 4 సాయంత్రం 6 గంటల నుండి స్టార్ మా లో మొదలయ్యింది. నాగార్జున డాన్స్ ఎంట్రీ తో సీజన్ 6 ఎంట్రీ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి డాన్స్ చేసిన నాగార్జున ఈసారి సీజన్ 6 హౌస్ లోకి పంపిన మొదటి కంటెస్టెంట్ ఎవరంటే.. కార్తీక దీపంలో హిమ కేరెక్టర్ చేస్తున్న కీర్తి భట్. కీర్తి భట్ కార్తీక దీపం కన్నా ముందే మానస్ హీరోగా మొదలైన మానసిచ్చి చూడు సీరియల్ లో హీరోయిన్ గా బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరయింది. తర్వాత కార్తీక దీపం సీరియల్ లో కనిపించింది. ఇప్పుడు సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చింది.
అదిరిపోయే డాన్స్ తో ఎంట్రీ ఇచ్చిన కీర్తి భట్ స్టేజ్ పై నాగ్ తో మట్లాడుతూ.. తన కన్నీటి గాదని బయటపెట్టింది. ఓ టెంపుల్ కి వెళ్లి వస్తున్న సమయంలో కీర్తి భట్ ఫ్యామిలీ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. కేవలం తన తల్లిదండ్రులనే కాదు.. అన్న, వదినలు కూడా కీర్తి తన కళ్ల ముందే కోల్పోయి రోడ్డు మీద ఒంటరిగా ఉంది.. 32 రోజుల పాటు కోమాలో ఉండి.. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ స్టేజ్ పై ఉన్నట్లుగా చెప్పింది. కీర్తి హౌస్ లోకి కాలు పెట్టిన మొదటి కంటెస్టెంట్ గా నిలువగా.. రెండో కంటెస్టెంట్ గా నువ్వు నాకు నచ్చావ్ పింకీ(సుదీపా) హౌస్ లోకి అడుగుపెట్టింది. మూడో కంటెస్టెంట్ గా సిరి బాయ్ ఫ్రెండ్ గా హైలెట్ అయిన శ్రీహన్ అదిరిపోయే డాన్స్ స్టెప్స్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.