ప్రస్తుతం బాలీవుడ్ కి బాడ్ టైం నడుస్తుంది. ఎన్నో అంచనాలు నడుమ విడుదలవుతున్న భారీ బడ్జెట్, మీడియం రేంజ్ సినిమాలన్నీ డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్లడంతో అక్కడి ప్రముఖులపై ఒత్తిడి పెరిగిపోతుంది. నెటిజెన్స్, ఆడియన్స్ అందరూ బాలీవుడ్ మూవీస్ ని సౌత్ మూవీస్ తో కంపేర్ చెయ్యడంతో ఈ సమస్య మొదలవడమే కాదు, బాలీవుడ్ నేపోటిజం పై ఉన్న తీవ్ర వ్యతిరేఖతకూడా బాలీవుడ్ ని కష్టాల సుడిగుండాల్లోకి నెట్టింది. ప్రధానంగా సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ మరణం బాలీవుడ్ పై వ్యతిరేఖని పెంచేసింది. పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటూ సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నాయి. దానితో సినిమాల రిలీజ్ కి ప్రమోషన్స్ చేస్తున్న ఆయా చిత్ర బృందాలపై ఈ ఒత్తిడి పెరిగిపోతుంది.
ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పటినుండి మరో ఎత్తు అన్నట్టుగా.. ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాలపై నెటిజెన్స్ నెగెటివిటి చూపించినా.. ఇప్పుడు సౌత్ హీరో, దర్శకుడి అండతో బాక్సాఫీసు వద్దకి రాబోతున్న రణబీర్-అలియా భట్ ల బ్రహ్మస్త్రపైనే అందరి చూపు ఉంది. సోషల్ మీడియాలో #BoyCottBrahmastra హాష్ టాగ్ ట్రెండ్ అవుతున్నా.. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ప్రమోషన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ బ్రహ్మాస్త్రపై పడుతుంది. కంటెంట్ బావుంటే.. సినిమా హిట్ అవడం పక్కా.. ఈ బాయ్ కాట్ యాష్ టాగ్స్ ఎవ్వరిని ఏమి చేయలేవని ధీమా చూపిస్తున్నా.. బ్రహ్మస్త్ర టీంలో మాత్రం లోలోపల ఒణుకు కనిపిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్రకి ముందు బ్రహ్మాస్త్రకి తర్వాత అనేలా ఉండబోతుంది అని.. ఒకవేళ సినిమా నిలబడకపోతే.. బాలీవుడ్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని, అదే హిట్ అయితే బాలీవుడ్ మళ్ళీ వెలిగిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. అంటే బ్రహ్మాస్త్రతో బాలీవుడ్ భవిష్యత్తు ఖరారైనట్టే కదా మరి.