Advertisementt

రణబీర్-అలియా అస్సలు తగ్గడం లేదుగా..

Sun 04th Sep 2022 11:48 AM
ranbir kapoor,alia bhatt,cash show  రణబీర్-అలియా అస్సలు తగ్గడం లేదుగా..
Ranbir Kapoor - Alia Bhatt attends Suma Cash show రణబీర్-అలియా అస్సలు తగ్గడం లేదుగా..
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ అప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్-రామ్, చరణ్ బాలీవుడ్ లో సినిమాని ఎన్ని విధాలుగా ప్రమోట్ చెయ్యాలో అన్నిరకాలుగా జక్కన్నతో కలిసి చేసారు. అది ఈవెంట్ కానివ్వండి, బుల్లితెర షోస్ కానివ్వండి ఇలా ఏ ప్లాట్ ఫామ్ వదల్లేదు. అక్కడ పాపులర్ అయిన కరణ్ జోహార్ షో, కపిల్ శర్మ, ఇంకా యూట్యూబ్ ఇంటర్వూస్ లో సందడి చేసారు. ఇప్పుడు అదే పద్దతిని టాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర టీం ఫాలో అవుతోంది. ఇక్కడ హైదరాబాద్ లో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి హైప్ క్రియేట్ చేసిన రణబీర్-అలియా భట్, కరణ్ జోహార్, రాజమౌళి లు.. బ్రహ్మాస్త్రాన్ని మరింతగా ప్రమోట్ చేసేందుకు బుల్లితెర షోస్ కి వచ్చేసారు.

రాజమౌళి లాంటి పెద్ద పాన్ ఇండియా దర్శకుడు, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్, రణబీర్ కపూర్, బ్రహ్మాస్త్రలో మరో హీరోయిన్ మౌని రాయ్ లు బుల్లితెర మీద పాపులర్ షో అయిన సుమ క్యాష్ కి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలియా భట్ మోడరన్ గా రాగా.. రణబీర్ హుందాగా అటెండ్ అయిన సుమ క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాని ఎన్ని విధాలుగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలో అన్ని విధాలుగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోను బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ, రణబీర్, అలియా లు బిగ్ బాస్ కి వచ్చి సినిమాని ప్రమోట్ చేసారు. ఇప్పుడు క్యాష్ షో కి వచ్చారు.

Ranbir Kapoor - Alia Bhatt attends Suma Cash show:

Ranbir Kapoor and Alia Bhatt Focuses On Telugu Market

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ