Advertisementt

బిగ్ ప్రాజెక్ట్ లోకి రకుల్ ఎంట్రీ

Sun 04th Sep 2022 10:24 AM
rakul preet singh,india 2,kamal hasan  బిగ్ ప్రాజెక్ట్ లోకి రకుల్ ఎంట్రీ
Rakul Preet joins the sets of Indian 2 బిగ్ ప్రాజెక్ట్ లోకి రకుల్ ఎంట్రీ
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ సింగ్ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించిన పేరు. మహేష్ దగ్గర నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరి హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్.. తర్వాత వరస ప్లాప్స్ తో టాలీవుడ్ కి దూరమైంది. ప్రెజెంట్ బాలీవుడ్ మూవీస్ తో బిజీ అయిన రకుల్ ప్రీత్ సౌత్ మీద కూడా కన్నేసే ఉంటుంది. సోషల్ మీడియాలో తరచూ హొయలు పోయే ఆమె.. పారితోషకం తగ్గించుకుని దర్శకనిర్మాతలకు సిగ్నల్ ఇస్తున్నా.. ఇక్కడ ఆమెని పట్టించుకున్న నాధుడు లేదు. ఇలాంటి టైం లోనే రకుల్ ఇప్పుడు సౌత్ లోకి ఓ బిగ్ ప్రాజెక్ట్ తో అడుగుపెట్టింది. అది కాజల్ అగర్వాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న భారతీయుడు 2 సెట్స్ లోకి రకుల్ ప్రీత్ తాజాగా ఎంట్రీ ఇచ్చింది. 

శంకర్-కమల్ హాసన్ కలయికలో మళ్ళీ మొదలైన ఇండియన్ 2 లో రకుల్ ప్రీత్ కూడా ఒక హీరోయిన్. కొన్ని సమస్యల కారణంగా షూటింగ్ కొన్నాళ్ళపాటు ఆగినా మళ్లీ రీసెంట్ గానే భారతీయుడు2 షూటింగ్ మొదలు పెట్టడంతో రకుల్-కాజల్ కూడా భారతీయుడు షూటింగ్ కోసం రెడీ అవుతున్న తరుణంలో రకుల్ సెట్స్ లోకి అడుగుపెట్టిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి వైరల్ అయ్యాయి. ఇక సౌత్ లో ఫెడవుట్ అవుతున్న సమయంలో రకుల్ ప్రీత్ పేరు భారతీయుడు లాంటి బిగ్ ప్రాజెక్ట్ లకి వినిపించడం ఆమె అదృష్టమే.

Rakul Preet joins the sets of Indian 2:

Rakul Preet Singh is playing a key role in India 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ