ఒక్కో హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగానే.. మొదటి సినిమాతోనే.. లేదంటే రెండో సినిమాతోనే సక్సెస్ సాధించి సెటిలవుతారు. అందుకు పెద్ద ఉదాహరణలు కృతి శెట్టి, శ్రీ లీలా లాంటి హీరోయిన్స్. ఒకసారి ప్లాప్ వచ్చినా రెండోసారి లక్ తగిలితే ఓకె.. కానీ వరసగా మూడు డిజాస్టర్స్ అయితే ఆ హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ప్రస్తుతం అదే ఫీల్ లో రంగ రంగ వైభవంగా హీరోయిన్ కేతిక శర్మ ఉంది. ఎంతగా గ్లామర్ ఒలకబోసినా.. అమ్మాయికి పని జరగడం లేదు. మొదటి సినిమా రొమాంటిక్ లో ఆకాష్ పూరి తో హాట్ గా హగ్గులతో రెచ్చిపోయిన.. ఆ సినిమా ప్లాప్ అవడంతో అమ్మడు నిరాశ పడింది. ఆ సినిమా తర్వాత నాగ శౌర్య ని నమ్మి లక్ష్యలో నటించింది. రెండో సినిమా కూడా కేతిక కి నిరాశే మిగిల్చింది.
ఆ సినిమాలోనూ ట్రెడిషనల్ గాను, గ్లామర్ గాను కనిపించినా సినిమా ప్లాప్ అవడంతో కేతికకి పెద్దగా పేరు రాలేదు. మూడో సినిమాని మెగా యంగ్ హీరో వైష్ణవ తేజ్ తో చేస్తే.. అది ఆమెకి కలిసి రాలేదు. వైష్ణవ్ తేజ్ చేసిన రొమాన్స్ తోనే హైలెట్ అయ్యి.. ప్రమోషన్స్ లో చూపించిన గ్లామర్ అన్నీ ఈసారి ఆమెకి హిట్ పక్కాగా తెచ్చిపెడుతుంది అనుకున్నారు. కానీ కేతికకి మూడో సినిమా కూడా షాకిచ్చింది. దానితో అమ్మడు మరింతగా నీరసపడిపోయింది. మరి ఈ బోల్డ్ బ్యూటీకి రాబోయే సినిమాలైనా హిట్ ఇస్తాయో.. లేదో.. చూడాలి.