బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కావడానికి మరి కొన్ని గంటల టైం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 4 ఆదివారం సాయత్రం 6 గంటల నుంచి స్టార్ మా లో గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ తో కంటెస్టెంన్స్ హౌస్ లోకి అడుగుపట్టబోతున్నారు. ఆదివారం ఉదయం నుండే సీజన్ 6 ఎపిసోడ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ సెట్ లో మొదలు కాబోతుంది. అటు హాట్ స్టార్ లోను నాగార్జున హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ 6 ని 24 గంటలు లైవ్ ప్రసారాలు అందించనున్నారు. ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్న 18 మంది కంటెస్టెంట్స్ రేపు హౌస్ లోకి ఆరోగ్యంగా అడుగుపెట్టబోతున్నారు. 16 మంది సెలబ్రిటీస్, 2 రు సామాన్యులతో బిగ్ బాస్ హౌస్ 6 కళకళలాడబోతుంది.
నిన్నటివరకు క్వారంటైన్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుండి గత రాత్రి నుండి సెల్ ఫోన్స్ తీసేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి హౌస్ లోకి సింగర్ రేవంత్ అడుగుపెట్టబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొంతమంది సెల్ ఫోన్ తీసుకునేముందు ఇండైరెక్ట్ గా హౌస్ లోకి వెళ్ళబోతున్నట్టుగా పోస్ట్ లు పెట్టగా.. సింగర్ రేవంత్ మాత్రం బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తున్నానని చెప్పడమే కాదు.. ఇంకా హౌస్‌లోకి అడుగుపెట్టకుండా బిగ్ బాస్ టైటిల్ నాదే అంటూ ధీమాగా చెప్తున్నాడు. అంతేకాకుండా తనకి ఓట్లు వేయాలని కూడా అభ్యర్ధిస్తూ తన ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.