కోలీవుడ్ హాట్ బ్యూటీ నయనతార విగ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పబోతోంది. ఇది నయనతార అత్తగారి కండిషన్ అంటూ ప్రచారం జరిగింది. కానీ నయనతార విగ్నేష్ ని వివాహం చేసుకున్నాక హనీమూన్ కి వెళ్లొచ్చి.. షారుఖ్ తో చేస్తున్న జవాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. మరి పెళ్లి తర్వాత సినిమా షూటింగ్స్ చెయ్యకూడదు, పద్దతిగా ఉండాలన్న నయనతార హనీమూన్ లో అంతలా చెలరేగి పోయి అందాలు ఆరబోయదు, చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చెయ్యదు అని మాట్లాడుకున్నారు. తర్వాత నయన్ షూటింగ్ కి హాజరవడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి.
మళ్ళీ ఇప్పుడు నయనతార అభిమానులకి షాక్ ఇవ్వబోతుంది. త్వరలోనే ఆమె సినిమాలకి గుడ్ బై చెప్పబోతోంది. ఇకపై ఆమె తన వ్యాపారాలతో బిజీ కాబోతుంది అంటూ ప్రచారం మొదలైంది. ఆమె హీరోయిన్ గా సినిమాలు చెయ్యడం మాత్రమే కాకుండా.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు సినిమాలు మానేసి ఆ బిజినెస్ చూసుకోవాలని ఆమె డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన నయన్ నటనకు గుడ్ బై చెప్పినా.. సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతుంది అంటూ ప్రచారం షురూ అయ్యింది. ఈ విషయమై అటు నయన్, ఇటు విగ్నేష్ లు స్పందిస్తేనే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.