యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ అయిన హీరో. ఎందుకంటే కొరటాలతో ఆయన చెయ్యాల్సిన మూవీ ఇంకా సెట్స్ మీదకి వెళ్లకపోయినా.. బ్రహ్మాస్త్ర ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ లుక్ చూసిన ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఎన్టీఆర్ న్యూ లుక్, ఆయన స్లిమ్ లుక్ చూసిన ఫాన్స్ చాలా అంటే చాలా సర్ ప్రైజ్ అవుతున్నారు. అదలా ఉంటే.. ఎన్టీఆర్-కొరటాలతో చెయ్యబోయే సినిమాలో ముందుగా హీరోయిన్ గా అలియా భట్ ని అనుకున్నారు. ఆమె పెళ్లి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ తో ఎన్టీఆర్ మూవీ నుండి తప్పుకుంది. కానీ ఫాన్స్ ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు.
ఎందుకంటే గత రాత్రి బ్రహ్మాస్త్ర ఈవెంట్ లో అలియా భట్ చాలా క్యూట్ గా కనిపించడమే కాదు.. తెలుగులో పాట కూడా పాడింది. అంతేకాకుండా ఎన్టీఆర్ గురించి అలియా మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. ఎన్టీఆర్ కూడా అలియా భట్ గురించి పాజిటివ్ గా అందంగా మాట్లాడాడు. పింక్ డ్రెస్ లో చాలా ట్రెడిషనల్ గా అలియా భట్ స్టేజ్ పై ఎన్టీఆర్ పక్కన కనిపించేసరికి.. కొరటాల తో చేసే NTR30 లో ఎన్టీఆర్ తో అలియా భట్ కనిపించినట్టయితే.. ఎంత బావుండేది. స్క్రీన్ మీద ఇద్దరి రొమాన్స్ అలా చూస్తే అదిరిపోయేది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు..