ఈరోజు సోషల్ మీడియాలో ఓ విచిత్రం కనిపించింది. అది ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఉన్నట్టుండి హోంబ్లే ఫిలిమ్స్ వారు 9.43 నిమిషాలకి KGF ట్విట్టర్ అఫీషియల్ పేజీ లో MONSTER అని ట్వీట్ చేస్తే.. 9.44 నిమిషాలకి అదే నిర్మాణ సంస్థ ప్రభాస్ సలార్ ట్విట్టర్ హ్యాండిల్ లో VIOLENT అంటూ ట్వీట్ చెయ్యడం ప్రభాస్ ఫాన్స్ కి, యశ్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. అసలు ఆ ట్వీట్స్ కి అర్ధం తెలియకపోయినా ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఏదో జరుగుతుంది.. అదేమిటో అర్ధం కావడం లేదు, కానీ ఒకేసారి రెండు బిగ్ ప్రాజెక్ట్స్ నుండి ట్వీట్స్ రావడం మాత్రం ఫాన్స్ పండగ చేసుకునేలా చేసింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
సలార్, KGF ట్వీట్స్ చూసిన పుష్ప మేకర్స్ కూడా పుష్ప ట్విట్టర్ హ్యాండిల్ లో FIRE అంటూ ట్వీట్ చేసారు. సలార్, కెజిఫ్ ట్వీట్స్ వచ్చిన రెండు గంటలకి పుష్ప నుండి FIRE అనే ట్వీట్ రావడంతో ప్రభాస్, కెజిఎఫ్ ఫాన్స్ మమ్మల్ని కాపీ చెయ్యడమే మీ పని అంటూ రిప్లై ఇస్తున్నారు. ప్రస్తుతం సలార్ సెట్స్ మీదుండగా.. KGF3 మొదలు కావాల్సి ఉంది. ఇక పుష్ప రెగ్యులర్ షూట్ కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు.