Advertisementt

వైరల్: ఇండస్ట్రీపై ఎన్టీఆర్ కామెంట్స్

Sat 03rd Sep 2022 11:48 AM
jr ntr,tollywood,brahmastra event  వైరల్: ఇండస్ట్రీపై ఎన్టీఆర్ కామెంట్స్
Viral: NTR comments on the industry వైరల్: ఇండస్ట్రీపై ఎన్టీఆర్ కామెంట్స్
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం హైదరాబాద్ లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలిచిన బ్రహ్మాస్త్ర టీం కి హైదరాబాద్ పోలీస్ లు షాకిచ్చారు. ఈవెంట్ కి భద్రత కలిపించలేమంటూ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయించడంతో ఎన్టీఆర్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర టీం రాజమౌళి, ఎన్టీఆర్ పార్క్ హయాత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అతిధిగా హాజరైన ఎన్టీఆర్ ముందుగా అభిమానులకి క్షమాపణలు చెప్పాడు. ఎంతో గ్రాండ్ గా ఈవెంట్ ప్లాన్ చేసినా.. పోలీస్ లు రక్షణ కల్పించలేమని చెప్పడంతో ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేయించాల్సి వచ్చింది. పోలీస్ లు మన భద్రతా కోసమే చెప్పారు. ఈవెంట్ కి రావాలనుకున్న అభిమానులు రాలేకపోయారు.. అందుకే వారికి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్ అలియా భట్ గురించి, రణబీర్, కరణ్ జోహార్ గురించి మాట్లాడాడు.

ఆ తర్వాత ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. సినిమా ఇండ‌స్ట్రీ తెలియ‌ని ప్రెష‌ర్‌కి లోన‌వుతుంది. ప్రేక్ష‌కులు కొత్తగా ఆలోచిస్తున్నారు. వారికి కొత్త‌గా ఏదో కావాలి. నేను వ్య‌క్తిగ‌తంగా చెప్పే విష‌య‌మేమంటే మేం ప్రెజ‌ర్‌లో ఉన్న‌ప్పుడు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాం. టోట‌ల్ సినిమా ఇండ‌స్ట్రీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ఛాలెంజ్‌ను స్వీక‌రించి ముందుకు వెళ‌దాం. గొప్ప సినిమాల‌ను మ‌న ప్రేక్ష‌కుల కోసం అందిద్దాం.. అంటూ ఎన్టీఆర్ బ్రహ్మాస్త్ర ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Viral: NTR comments on the industry:

Jr NTR comments on Tollywood industry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ