Advertisementt

జబర్దస్త్ పనైపోలేదు.. ఇది నిజం

Sat 03rd Sep 2022 09:57 AM
extra jabardasth,khushboo,indraja  జబర్దస్త్ పనైపోలేదు.. ఇది నిజం
Extra Jabardasth Latest Episode highlights జబర్దస్త్ పనైపోలేదు.. ఇది నిజం
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా వినాయక చవితి స్పెషల్ అంటూ జబర్దస్త్ లో కమెడియన్స్ తమ స్కిట్స్ లో కామెడీ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ కి కోలీవుడ్ నటి ఖుష్బూ వన్ అఫ్ ద జేడ్జ్ లా సెటిల్ అయ్యేలా కనిపిస్తుంది. రోజా జబర్దస్త్ నుండి తప్పుకున్నప్పటి నుండి ఇంద్రజ రెగ్యులర్ గా జబర్దస్త్ కి వస్తుంది. ఇక జబర్దస్త్ లో రీసెంట్ గా ఎన్నో మార్పులు వచ్చాయి. సుధీర్, ఆది లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వదిలేసారు. ఇంకొంతమంది కూడా జబర్దస్త్ ని వదిలెయ్యగా.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎపిసోడ్ కి నాలుగు స్కిట్స్ చొప్పున ప్రసారం చేస్తున్నారు. రాఘవ, చంటి లాంటివాళ్లు, భాస్కర్, కెవ్వు కార్తీక్, రామ్ ప్రసాద్, రాకేష్ లాంటి వాళ్ళు టీం లీడర్స్ గా జబర్దస్త్ ని లాగించేస్తున్నారు. 

గత రాత్రి శుక్రవారం ఎపిసోడ్ కి రంగ రంగ వైభవంగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతిక, దర్శకుడు గిరీశాయ తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. ఇక జబర్దస్త్ మొదలయ్యే ముందు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్కిట్స్ లో ఒకరికి ఒకరు సహాయపడతాం, అన్ని టీం లు బావుండాలి. జబర్దస్త్ ని నెంబర్ వన్ పొజిషన్ కి తెస్తాం అని గెటప్ శ్రీను అంటే.. ఆటో రామ్ ప్రసాద్ ఎవరన్నారు జబర్దస్త్ పనైపోయింది అని, బయట చాలా రూమర్స్ ఉన్నాయి.. మళ్ళీ జబర్దస్త్ ని మంచి పొజిషన్ కి తెస్తాం. మేమంతా జబర్దస్త్ కోసం కష్టపడతాం, కొత్తగా చేస్తాం.. ఇది నిజం అన్నాడు. అలాగే భాస్కర్, రాకేష్, ఆఖరికి రష్మీ కూడా జబర్దస్త్ ని ఎప్పటిలాగే నెంబర్ వన్ ప్లేస్ లో నిలబెడతాం అంటూ శబదం చేసారు.

Extra Jabardasth Latest Episode highlights:

Extra Jabardasth friday episode review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ