కెరీర్ లో రెండు మూడు సినిమాలు ఇచ్చిన ఊపుతో తనో పెద్ద స్టార్ లా ఫీలై.. తన కున్న ఫాన్స్ ని చూసుకుని రెచ్చిపోయి మాట్లాడిన విజయ్ దేవరకొండ కి లైగర్ ఇచ్చిన షాక్ కన్నా ఆయన మీద నడిచే ట్రోల్స్, విమర్శించే విమర్శలు ఎక్కువయ్యాయి. పూరి జగన్నాథ్ తో చేసిన లైగర్ మూవీ డిసాస్టర్ అవడంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడడం ఖాయంగా కనిపిస్తుంది. హీరో గా విజయ్ కి లాస్ ఏమి ఉండదు. నిర్మాతలుగా పూరి-ఛార్మి-కరణ్ సినిమాని అమ్మేసారు. కానీ లైగర్ ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. వాళ్ళు ఊరుకోరు.. పూరి మీద పడతారు.
అందుకే లైగర్ నష్టాలను పూడ్చడానికి విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ లో నుండి ఓ 6 కోట్లు పూరికి, ఛార్మికి తిరిగిచ్చేశాడని అంటున్నారు. లైగర్ కి 35 కోట్లు పారితోషకం అందుకున్నాడనే టాక్ ఉన్న టైం లో ఇలా విజయ్ తన పారితోషకంలో 6 కోట్లు వెనక్కి ఇచ్చాడనే న్యూస్ చూడగానే ఆయన ఫాన్స్ మా హీరో రియల్ హీరో అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. పారితోషకమే కాకుండా విజయ్ కి నాన్ థియేట్రికల్ రైట్స్ లోను వాటా ఉన్నప్పటికీ.. అది కూడా వద్దని చెప్పేసాడని అంటున్నారు. అటు పూరి కూడా లైగర్ నష్టాన్ని భరించేందుకు గాను పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70 శాతం వెనక్కి ఇచ్చాడని తెలుస్తుంది.