Advertisementt

ఎన్టీఆర్ న్యూ లుక్.. ఇంప్రెస్స్ అవుతున్న ఫాన్స్

Fri 02nd Sep 2022 10:56 PM
ntr fans,jr ntr,brahmastra  ఎన్టీఆర్ న్యూ లుక్.. ఇంప్రెస్స్ అవుతున్న ఫాన్స్
NTR new look, impressing fans ఎన్టీఆర్ న్యూ లుక్.. ఇంప్రెస్స్ అవుతున్న ఫాన్స్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే NTR30 పై ఫాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఎంతగా ఎదురు చూస్తున్నారో ఆ ప్రొజెక్ట్ అంతగా వెనక్కి వెళుతుంది. ఇక ఎన్టీఆర్ కూడా కొత్త ప్రొజెక్ట్ మొదలు కాకపోవడంతో.. పబ్లిక్ లో పెద్దగా కనిపించడం మానేశారు. గత నెలలో ఎన్టీఆర్.. అన్న కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఈవెంట్ లో కనిపించగా.. ఎన్టీఆర్ ఫాన్స్ షాక్ అయ్యారు. కారణం ఎన్టీఆర్ బరువు తగ్గకపోగా.. బుగ్గలు ఉబ్బిపోయి కనిపించారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. మిగతా హీరోల ఫాన్స్ వెటకారంగా ఎన్టీఆర్ డిస్టబెన్స్ లో ఉన్నాడు.. కొరటాల మూవీ విషయమై ఆలోచనలో ఉన్నాడు అంటూ మట్లాడుకున్నారు. 

కానీ తాజాగా యంగ్ టైగర్ తన పవర్ షేర్ చేసేందుకు రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన బ్రహ్మస్త్ర కి ఈవెంట్ కి వెళ్లగా.. అక్కడికి ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసిన ఫాన్స్ లెక్కకుమించి ర్యాలీలు చేస్తూ హడావిడి చెయ్యడంతో వాళ్ళని కంట్రిల్ చెయ్యలేక పోలీస్ లు ఏకంగా ఈవెంట్ నే క్యాన్సిల్ చేయించారు. దానితో ఆ ఈవెంట్ పార్క్ హయ్యత్ కి మారింది. ఎన్టీఆర్ పార్క్ హయ్యత్ కి వెళ్లి ఈవెంట్ లో పాల్గొన్నాడు. అలియా భట్, రణబీర్ కపూర్, రాజమౌళి, కరణ్, నాగార్జున ఇలా అక్కడ ఎంతమంది స్టార్స్ ఉన్నా అందరూ ఎన్టీఆర్ నే చూసారు. ఎన్టీఆర్ ఫాన్స్ రామోజీ ఫిలిం సిటీ విషయంలో డిస్పాయింట్ అయినా.. ఇక్కడ ఎన్టీఆర్ లుక్ తో తెగ ఇంప్రెస్స్ అవుతున్నారు. ఒక్క నెలలో ఎంత బరువు తగ్గావ్ అన్నా అంటూ ఎన్టీఆర్ సన్నబడం చూసిన ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా కనిపించి ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు.

NTR new look, impressing fans:

Fans impressed with Jr NTR new look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ