Advertisementt

చివరి నిమిషంలో బ్రహ్మాస్త్ర టీం కి షాక్

Fri 02nd Sep 2022 07:06 PM
brahmastra,rfc,ntr  చివరి నిమిషంలో బ్రహ్మాస్త్ర టీం కి షాక్
Brahmastra Event Update చివరి నిమిషంలో బ్రహ్మాస్త్ర టీం కి షాక్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని టాలీవుడ్ దర్శకధీరుడు, జూనియర్ ఎన్టీఆర్ లు భుజాన వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి బ్రహ్మాస్త్ర టీం తో ముంబై, చెన్నై అంటూ ప్రమోషన్స్ చేపట్టారు. తాజాగా రణబీర్ కపూర్-అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ చూపించడానికి బయలుదేరి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. ఈ రోజు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్ర ఈవెంట్ ప్లాన్ చేసి.. అన్ని కార్యక్రమాలు అంటే స్టేజ్ సెటప్, అభిమానుల పాస్ లు అన్ని రెడీ అయ్యాక ఈవెంట్ టైం కి బ్రహ్మాస్త్ర టీం కి బిగ్ షాక్ ఇచ్చారు.

వినాయక చవితి ఉత్సవాల సందర్భం గా బ్రహ్మాస్త్ర ఈవెంట్ నిర్వహణకు పోలీస్ లు అనుమతి ఇవ్వకపోవడం లాస్ట్ మినిట్ లో ఈవెంట్ ని క్యాన్సిల్ చేసి అదే ఈవెంట్ ని హైదరాబాద్ పార్క్ హయాత్ కి షిఫ్ట్ చేసారు. బ్రహ్మాస్త్ర ఈవెంట్ క్యాన్సిల్ ఈవెంట్ పీఆర్ టీం హడావిడిగా అప్ డేట్ ఇచ్చారు. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మాస్త్ర టీం మీడియా తో మాట్లాడతారని తెలుస్తారు. అయితే ఎన్టీఆర్ బ్రహ్మాస్త్ర ఈవెంట్ కి హాజరవుతారని ఎన్టీఆర్ ఫాన్స్ ఉత్సాహపడుతుంటే.. పోలీస్ లు ఇచ్చిన షాక్ తో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. 

Brahmastra Event Update:

Latest: Brahmastra pre-release event at RFC gets cancelled

Tags:   BRAHMASTRA, RFC, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ