Advertisementt

బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ అదేనా?

Fri 02nd Sep 2022 05:36 PM
bigg boss,tbigg boss telugu season 6,bigg boss 6  బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ అదేనా?
Is this the final list of Bigg Boss 6? బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ అదేనా?
Advertisement
Ads by CJ

మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం బుల్లితెర ఆడియన్స్ ఆత్రుత ఎక్కువవగా.. నాగార్జున రోజుకో ప్రోమో తో వాళ్ళ ఆత్రుతని అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం స్టార్ మా లో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం ఈసారి అదిరిపోయే హౌస్ సెట్, హౌస్ మోడల్, ఖరీదైన ఫర్నిచర్ ఇలా అన్ని హంగులతో కొత్త కంటెస్టెంట్స్ కి ఆహ్వానం పలుకుతుంది బిగ్ బాస్ హౌస్. లివింగ్ రూమ్, కిచెన్ ఇలా వరసగా హౌస్ లోని కొన్ని భాగాలను నాగార్జున ఎప్పుడో పరిచయం చేసేసారు. నాగ్ హోస్ట్ గా మొదలు కాబోతున్న ఈ సీజన్ 6 లోకి ఎంటర్ అయ్యేవారి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈసారి సెలబ్రిటీస్ తో పాటుగా కామన్ వ్యక్తులు కూడా హౌస్ లోకి రాబోతున్నట్లుగా నాగ్ కూడా రివీల్ చేసేసారు. అయితే హౌస్ లోకి 16 మంది సెలబ్రిటీస్ తో పాటుగా ఇద్దరు కామన్ వ్యక్తులు ఈసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందులో శ్రీ సత్య, శ్రీహాన్, గీతు రాయల్, యాంకర్ నేహా చౌదరి, యూట్యూబర్ ఆది రెడ్డి, టీవీ9 యాంకర్ ఆరోహి, ఇనయ సుల్తానా,  బాలాదిత్య, చలాకి చంటి, ఆర్జే సూర్య, యాంకర్ అండ్ హీరోయిన్ వాసంతి, సాల్మాన్, సీరియల్ ఆర్టిస్ట్ లు మెరిన్ అండ్ రోహిత్, నటి అభినయశ్రీ, సింగర్ రేవంత్ తో పాటుగా ఇద్దరు కామన్ మ్యాన్స్ సీజన్ సిక్స్ లోకి వెళ్ళబోతున్న కంటెస్టెంట్స్ గా లిస్ట్ ప్రచారంలోకి వచ్చింది. మరి ఎవరెవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారో అనేది ఆదివారం 6 గంటలకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

Is this the final list of Bigg Boss 6?:

Bigg Boss Telugu Season 6 Contestants List

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ