Advertisementt

మాది స్నేహం మాత్రమే.. ప్రేమ కాదు: టైగర్

Fri 02nd Sep 2022 10:07 AM
tiger shroff,disha patani,koffee with karan show  మాది స్నేహం మాత్రమే.. ప్రేమ కాదు: టైగర్
Tiger Shroff confirms his breakup with Disha Patani మాది స్నేహం మాత్రమే.. ప్రేమ కాదు: టైగర్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గ్లామర్ హీరోయిన్ దిశా పటాని ప్రేమలో ఉన్నారనే న్యూస్ బాలీవుడ్ లో ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ఎందుకంటే వీరిద్దరూ ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జంట. చాలా పార్టీలలోనూ కలిసే కనబడ్డారు. ఈ మధ్యన దిశా పటానితో టైగర్ ష్రాఫ్ బ్రేకప్ వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ మాత్రం వారిమధ్యన ఏం ఉందొ నాకు తెలియదు, వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పారు తప్ప వారి బ్రేకప్ వార్తలని ఖండించలేదు, అలాగని సపోర్ట్ చెయ్యలేదు. కానీ కరణ్ జోహార్ షో లో టైగర్ తో నిజాలు చెప్పే ప్రయత్నం చేయించాడు కరణ్ జోహార్.

తాజాగా కృతి సనన్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లిన టైగర్ ని మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏమిటి.. మీరు దిశా పటానితో డేటింగ్ లో ఉన్నారా అని అడిగితే.. మేము కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పాడు టైగర్. కానీ కరణ్ వదులుతాడా.. మీరు ముంబై వీధుల్లో తిరుగుతూ ప్రతి ఆదివారం మేము మిమ్మల్ని దిశాతో కలిసి రెస్టారెంట్ కి వెళుతుంటే చూస్తున్నాం అంటూ అడగగానే.. ఎందుకంటే మాకు అదే ఆహారం ఇష్టం అందుకే వెళుతున్నాం అంటూ తెలివిగా జవాబు చెప్పాడు. మరి మీపై బ్రేకప్ పుకార్లు వస్తున్నాయి. దానికి మీరు అసలు రిలేషన్ లో ఉన్నారో లేదో చెప్పాలి కదా అని అడిగాడు కరణ్. అవునా నిజామా.. మేము ఎప్పటినుండో మంచి స్నేహాన్ని మెయింటింగ్ చేస్తున్నాం అన్నాడు టైగర్. అయినా కరణ్ వదల్లేదు.. మరి మీరు వంటరిగా ఉన్నారా అనగా.. అవును నేను అలాగే అనుకుంటున్నాను అంటూ దిశా తో బ్రేకప్ విషయాన్ని చెప్పకనే చెప్పాడు టైగర్ ష్రాఫ్.

Tiger Shroff confirms his breakup with Disha Patani:

Tiger Shroff says he is single weeks after reports of break up with Disha Patani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ