Advertisement
Banner Ads

బడ్జెట్ కంట్రోల్ సాధ్యమేనా?

Thu 01st Sep 2022 10:09 PM
liger,vijay deverakonda,puri jagannadh,jana gana mana movie  బడ్జెట్ కంట్రోల్ సాధ్యమేనా?
Liger failure has affected Vijay Deverakonda and Puri Jagannadh Jana Gana Mana బడ్జెట్ కంట్రోల్ సాధ్యమేనా?
Advertisement
Banner Ads

ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఊపుతో.. విజయ్ దేవరకొండ తో ఫైటర్ మూవీ తీద్దామని.. కథ చెప్పి ఒప్పిస్తే.. తనకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.. ఫైటర్ ని బాలీవుడ్ రేంజ్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిద్దామని విజయ్ ఇచ్చిన సలహాతో పూరి జగన్నాథ్ ఏకంగా ముంబైలో మకాం పెట్టి, అక్కడో ఆఫీస్ తీసి ఫైటర్ బడ్జెట్ పెంచేశారు. తీరా ఫైటర్ టైటిల్ ఫిక్స్ చేద్దామనుకుంటున్న టైం లో ఆ టైటిల్ హ్రితిక్ రోషన్ కొట్టేసాడు. దానితో ఫైటర్ ని వదిలి లైగర్ అనే టైటిల్ పట్టుకొచ్చారు. ఇక లైగర్ కి కరణ్ జోహార్ కూడా తోడవడంతో.. బడ్జెట్ పరిమితులు దాటింది. అంచనాలు ఆకాశంలోకి వెళ్లాయి. కానీ అనుకున్న అంచనాలు అందుకోలేక లైగర్ డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది. 90 కోట్ల బడ్జెట్ పెడితే.. పట్టుమని 30 కోట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు.

ఆదాల ఉంటే.. లైగర్ డిసాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తదుపరి మూవీ జన గణ మన విషయంలో ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. లైగర్ పై విపరీతమైన నమ్మకం పెట్టుకున్న ఈ జంట జన గణ మన ని పట్టాలెక్కించేసి హడావిడి చేసింది. ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. కానీ లైగర్ దెబ్బకి విజయ్ అండ్ పూరి లు ఇప్పుడు జన గణ మన కి బడ్జెట్ కంట్రోల్ గురించి చర్చిస్తున్నారట. బడ్జెట్ కంట్రోల్ పెట్టి స్క్రిప్ట్ విషయంలో రాజి పడకూడదని, అనవసర ఖర్చు పెట్టకూడదని, బడ్జెట్ ని నియంత్రించాలని కూడా ఇద్దరూ కూర్చుని చర్చించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా  తెలుస్తుంది.  

కానీ పాన్ ఇండియా ఫిలిం అన్నాక బడ్జెట్ కంట్రోల్ సాధ్యమయ్యే పనేనా.. అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న.

Liger failure has affected Vijay Deverakonda and Puri Jagannadh Jana Gana Mana:

Liger box office failure majorly impacts Vijay Deverakonda-Puri Jagannadh Jana Gana Mana; team making big c

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads