పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి అభిమాన గణం లెక్కలేనంత ఉంది. ప్రభాస్ సినిమాల కోసం, ఆయా అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో ప్రభాస్ ఫాన్స్ నిర్మాణ సంస్థలపై మినీ యుద్ధమే చేస్తుంటారు. ఇక ప్రభాస్ స్వతహాగా చాలా సిగ్గరి. ఆయన చాలా మొహమాటస్తుడు. ఎవరితోనూ త్వరగా కలిసిపోలేడు. అలాంటి ప్రభాస్ ని ఆదిపురుష్ హీరోయిన్ కృత్ సనన్ తో పాటుగా కాఫీ విత్ కరణ్ షో లో కరణ్ జోహార్ ఓ ఆటాడుకున్నారు. బాలీవుడ్ లో పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షో లో కరణ్ జోహార్ కి గెస్ట్ లు గా కృతి సనన్-టైగర్ ష్రాఫ్ లు పాల్గొన్నారు. మరి కరణ్ జోహార్ ఆ షో లో ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాడో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో ఓ రౌండ్ లో గెస్ట్ గా వచ్చిన వారు ఓ సెలెబ్రిటికి ఫోన్ చెయ్యాల్సి ఉంటుంది.. అంతేకాకుండా ఫోన్ లో ఆ సెలెబ్రిటీతో హే కరణ్ ఇట్స్ మీ అని చెప్పించాల్సి ఉంటుంది.
అందులో భాగంగా కృతి సనన్ తన ఆదిపురుష్ హీరో ప్రభాస్ కి కాల్ చేసింది. హాయ్ ప్రభాస్.. నేను కరణ్ షోలో ఉన్నాను అని అంటుంది కృతి. హాయ్ కృతి అంటూ నవ్వుతూ పలకరించాడు ప్రభాస్. ఇక వెంటనే కరణ్ జోహర్ వచ్చి.. హేయ్ ప్రభాస్.. నేను కరణ్ జోహర్ అని అంటాడు.. అంతేకాకుండా హేయ్ కరణ్.. ఇట్స్ మీ అని చెప్పు అంటాడు. దానికి ప్రభాస్ కాస్త మొహమాటంగానే హేయ్ కరణ్ ఇట్స్ మీ ప్రభాస్ అని అంటాడు. వన్ అండ్ ఓన్లీ బాహుబలి ప్రభాస్.. కృతి సనన్‌కు రెండు పాయింట్లు సంపాదించి పెట్టాడు అని కరణ్ అన్నాడు. ఇక తరువాత కృతి మాట్లాడుతూ.. ప్రభాస్ నీకు మళ్లీ నేను చేస్తాను అని అంటుంది.. అలా ప్రభాస్ సిగ్గుపడుతూ మొహమాటపడుతూ మాట్లాడిన ఆ రెండు ముక్కలకే ప్రభాస్ ఫాన్స్ చాలా ఖుషి అయ్యిపోతున్నారు.