విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ డిసాస్టర్ అయినందుకు బాధపడాలో.. లేదంటే ఆయనపై వచ్చే ట్రోల్స్ చూసి బాధపడాలో అనేది ఆయనకే అర్ధం కానీ పరిస్థితిలో ఉంటే.. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టుగా టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఎగిరెగిరి పడితే ఇలాంటి డిజాస్టర్స్ ఎదురవుతాయని తమ్మారెడ్డి విజయ్ ని టార్గెట్ చేసారు. కేవలం సినిమా అనే కాకుండా.. ఏ విషయంలో కూడా ఎవరూ ఎగిరెగిరి పడకూడదని చెప్పారు. ఇలా చేస్తే చివరకు ఎదురుదెబ్బలే మిగులుతాయని అన్నారు.
మేము ఎంతో కష్టపడి సినిమాని తెరకెక్కించాం, మా చిత్రాన్ని చూడండి, ఆదరించండి అని ప్రమోషన్స్ చేసుకోవాలి కానీ.. చిటికెలు వేస్తూ చూస్తే చూడండి లేదంటే ఓటిటిలో చూడండి అంటూ చెబితే ప్రేక్షకులు ఇలాంటి ఫలితాన్నే ఇస్తారు. అంతేకాకుండా మీడియా వాళ్ళు మీరు లైగర్ ని చూసారా.. సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకోకపోవడానికి కారణాలు ఏమిటి అని అడగగా.. దానికి తమ్మారెడ్డి లైగర్ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని తనకు అనిపించలేదని చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తానని నిర్మొహమాటంగా చెప్పారు.
తాను పూరి జగన్నాధ్ కి అభిమానిని అని, పూరి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని.. కానీ ట్రైలర్ తోనే లైగర్ పై తనకు ఇంట్రెస్ట్ పోయింది అంటూ తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.