బాలీవుడ్ హీరోయిన్స్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు ఆర్థికనేరాల కేసులో అడ్డంగానే బుక్ అయ్యింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తో ఫ్రెండ్ షిప్ జాక్వెలిన్ కొంప ముంచింది. సుఖేశ్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా ఉండడమే కాదు, అతను చేసిన ఆర్థిక నేరాలలో జాక్వెలిన్ కూడా భాగస్వామి అంటూ ఈడీ జాక్వెలిన్ కి నోటీసు లు పంపడమే కాదు, సుఖేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో జాక్వెలిన్ పేరును చేర్చింది ఈడీ.
ఇప్పుడు కొత్తగా సుఖేష్ చంద్ర శేఖర్ జాక్వెలిన్ కోసం ఖరీదైన ఇల్లు కొన్నట్లుగా ఛార్జ్ షీట్ లో నమోదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. జాక్వెలిన్ కోసం సుఖేష్ ఆమె సొంత దేశమైన శ్రీలంక లో కాస్ట్లీ ఏరియాలో కాస్ట్లీ బంగాళా కొనుగోలు చెయ్యడమే కాదు, ముంబైలోని ఖరీదైన జుహు బీచ్ ప్రాంతంలో జాక్వెలిన్‌కు ఇల్లు కొనడానికి కొంత టోకెన్ డబ్బు సుఖేష్ ఇచ్చినట్లుగా ఈడీ పేర్కొంది. అంతేకాకుండా బహ్రెయిన్‌లోని జాక్వెలిన్ తల్లిదండ్రులకు ఇప్పటికే ఒక ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్ కూడా తనతో శ్రీలంకలో ఓ ఇల్లు కొనుగోలు చేసినట్టుగా సుఖేష్ చెప్పాడని, కానీ తానెప్పుడూ ఆ ఇంటిని చూడలేదు అని చెప్పిందట.
ఇంకా ఈడీ ఇచ్చిన వివరాల ప్రకారం ఇళ్లు కొనుగోలు పనిని సుఖేశ్ తన సహచరుడు పింకీ ఇరానీకి అప్పచెప్పినట్లు తెలుస్తుంది. గతంలో ఈ పింకీ ఇరానీని.. సుఖేశ్ కు జాక్వెలిన్ ను పరిచయం చేశాడు. దాని కోసమే ఇరానీకి సుఖేశ్ కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ కేసులో జాక్వెలిన్ ఢిల్లీ కోర్టులో హాజరు కావాల్సి ఉండగా.. ఈడీ పెట్టిన కేసులన్నీ ప్రూవ్ అయితే జావెలిన్ తప్పించుకునే ఛాన్స్ లేదు అంటున్నారు.
.