బాలీవుడ్ సినిమాల విషయంలో అసలే కష్టాల మీద కష్టాలు పడుతుంటే.. అక్కడ హీరోయిన్స్ పై, హీరోలపై వస్తున్న కేసులు బాలీవుడ్ ప్రతిష్టని మరింతగా దిగజారుస్తున్నాయి. గత ఏడాది శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలైతే.. షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాడు. అలాగే నటి జాక్వలిన్ వెంట ఈడీ పడుతుంది. ఈమధ్యన మాజీ హీరోయిన్ అమీషా పటేల్ పై జార్ఖండ్ ట్రయల్ కోర్టులో ఇటీవల చీటింగ్ కేసు నమోదు చేశారు. దేశీ మ్యాజిక్ అనే సినిమా కోసం 2.5 కోట్లు అడ్వాన్స్ ఇవ్వగా.. ఆ సినిమా అమీషా చేయకపోగా.. తనకి డబ్బు తిరిగి ఇవ్వలేదంటూ అమీషా పటేల్ పై ఆ సినిమా నిర్మాత చీటింగ్ కేసుతో పాటుగా, క్రిమినల్ కేస్ కూడా పెట్టాడు.
దానితో జార్ఖండ్ ట్రయల్ కోర్టు అమీషాపై సమన్లు జారీ చేసింది. దానితో అమీషా పటేల్ తనపై వచ్చిన ఈ క్రిమినల్ ప్రొసీడింగ్‌ను నిలివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అమీషా పటిషన్‌పై విచారణ జరిపిన బిఆర్ గవాయ, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తాజాగా జార్షండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ ఇచ్చింది. అమీషాపై క్రిమినల్ ప్రొసీడింగ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. మరి ఈ కేసులో పూర్తిగా అమీషా కి ఊరట లభిస్తుందో.. లేదో.. చూడాలి.