బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కావడానికి జస్ట్ 4 రోజులు మాత్రమే ఉంది. వచ్చే ఆదివారం సాయంత్రం సెప్టెంబర్ 4 న సీజన్ సిక్స్ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి రంగం సిద్ధమైంది. నాగార్జున రోజుకో ప్రోమోతో సీజన్ 6 పై ఆసక్తిని ఆత్రుతని, అంచనాలను పెంచేస్తున్నారు. బిగ్ బాస్ అంటే కొట్లాటలు, ప్రేమలు, టాస్క్ లు అంటూ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. అవే వారికి మరింత ఇంట్రెస్ట్ ని పెంచి బిగ్ బాస్ ని ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. మన ఇంట్లో ఎలా ఉన్నా.. పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉంటుంది. అందుకే ఇలాంటి రియాలిటీ షోస్ కి విపరీతమైన ఆదరణ ఉంటుంది.
ఇక నిన్న మంగళవారం నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోని ఓ ఏరియా ని పరిచయం చేస్తూ బిగ్ బాస్ వాయిస్ విని వచ్చారు. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం రెడీ చేసిన అందమైన లివింగ్ రూమ్ ని చూపించారు. బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ చాలా కొత్తగా, విశాలంగా కనిపిస్తుంది. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ నాగార్జున వచ్చేసారు. విక్రమ్ లోని కమల్ వాయిస్ తో ఈ సమయంలో వీరులంతా చెప్పేది ఒక్కటే అంటూ చెప్పిన డైలాగ్ అదుర్స్ అనేలా ఉంటే.. ఈసారి ఓపెనింగ్ ఎపిసోడ్ భీభత్సంగా ఉండబోతుంది అనేది మాత్రం ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది.